ఘనంగా క్రీస్తు రాజు పుణ్యక్షేత్ర రూబీ జూబిలీ వేడుకలు
ఘనంగా క్రీస్తు రాజు పుణ్యక్షేత్ర ఆవిర్భావ 40వ జూబిలీ ప్రారంభ వేడుకలు
విశాఖ అతిమేత్రాసనం,ఎర్ర సామంత వలస గిరిజన విచారణ లో క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం ఆవిర్భావ 40వ రూబీ జూబిలీ ప్రారంభ వేడుకలు ఘనంగా ఆత్మీయంగా జరిగాయి.విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్రసామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది.
40 సంవత్సరాలకు గుర్తుగా.. దేవునికి కృతజ్ఞతగా ప్రార్థనలు , దివ్యబలిపూజా కార్యక్రమాలు ఈ 40 రోజులు జరుగుతాయి అని విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారు తెలిపారు. క్రీస్తు రాజు పుణ్యక్షేత్ర మహోత్సవ ముగింపు వేడుకలు 30-11-2024 న జరగనున్నట్లు గురుశ్రీ పి జీవన్ బాబు గారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ పీఠాధిపతులు మహా పూజ్య కరణం దమన్ కుమార్ పాల్గొని ఈ ప్రారంభ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఇతర గురువులతో కలసి సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు. అధికసంఖ్యలో భక్తులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. విచారణ గాయకబృందం మధురమైన గీతాలను ఆలపించారు. సిస్టర్స్ మరియు యువతీ యువకులు తమ సహాయ సహకారాలని అందించారు.
ఈ కార్యక్రమంలో గురుశ్రీ కే పాల్ భూషణ్ గారు , గురుశ్రీ మరియాదాస్ గారు, గురుశ్రీ డి జయరాజు గారు, గురుశ్రీ రాజేంద్ర గారు, గురుశ్రీ సైమన్, గురుశ్రీ రయ్యప్ప , గురుశ్రీ మరియాదాస్ ఇతర గురువులు పాల్గొన్నారు.
విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer