ఘనంగా కార్మెల్ మాత వార్షిక మహోత్సవములు

ఘనంగా కార్మెల్ మాత వార్షిక మహోత్సవములు

గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ బాలయేసు పుణ్యక్షేత్రంలో కార్మెల్ మాత మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.

ప్రతి ఏడాది జూలై 14,15,16వ తేదీలలో "కొండ మీద పండుగ" పేరుతో  కార్మెల్ మాత మహోత్సవాలు జరుగుతాయి. జులై 14 న  పుణ్యక్షేత్ర రెక్టర్ గురుశ్రీ  ఫాతిమా మర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు మొదలయ్యాయి. మొదటి రోజు దివ్యబలిపూజను సమర్పించిన  గురుశ్రీ ఫాతిమా మర్రెడ్డి గారు అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. కార్మెల్ మాత మధ్యవర్తిత్వాన్ని వేడుకుంటే మంచి చేకూరుతుందని, ప్రజలందరూ ప్రభు యేసుని మార్గంలో నడవాలని కోరారు.  

రెండవ రోజు  సాయంత్రం 6 గంటలకు కొండ మెట్ల వద్ద గుంటూరు పీఠాధిపతులు మహా పూజ్య . చిన్నబత్తిని భాగ్యయ్య గారు పాల్గొని పండుగ సమిష్టి దివ్యబలిపూజను ఇతర గురువులతో కలసి సమర్పించారు.

ముందుగా బాలయేసు దేవాలయం వద్ద నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మరియమాత స్వరూపంతో గ్రామంలో ఊరేగింపుగా కొండ వద్దకు తీసుకువచ్చారు.

మహా పూజ్య చిన్నబత్తిని భాగ్యయ్య గారు దైవ సందేశాన్ని ప్రజలకు  అందించారు.  ఈ సందర్భముగా కార్మెల్ మాత "నిత్యసహాయమాత" అని మహా పూజ్య  చిన్నాబత్తిని భాగ్యయ్య గారు అన్నారు.

మఠకన్యలు, దేవాలయ పెద్దలు, సోడాలిటీ సభ్యులు, మరియదళ సభ్యులు, యువతీ యువకులు ఈ త్రిదిన ప్రార్థనలో పాల్గొన్నారు. వివిధ  ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఒక పక్క జోరున వర్షం పడుతున్నా కొండను ఎక్కి మరియతల్లి భక్తులు కార్మెల్ మాతను దర్శించుకొని ప్రార్థనల్లో పాల్గొన్నారు.

జులై 16  పండుగ రోజు కూడా ప్రత్యేక ప్రార్థనలు,ఉత్సవాలు  కార్మెల్ మాత కొండ వద్ద పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు, భోజన, వసతి ఏర్పాట్లు చేశామని గురుశ్రీ  ఫాతిమా మర్రెడ్డి గారు తెలియజేసారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer