గుణదల లూర్దుమాత మహోత్సవాలకు విచ్చేసిన కర్నూల్ పీఠకాపరి

Gunadala Feast 2025

గుణదల లూర్దుమాత మహోత్సవాలకు విచ్చేసిన కర్నూల్ పీఠకాపరి 

విజయవాడ మేత్రాసనం లోని గుణదల లూర్దుమాత మహోత్సవాలు 9 ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమయ్యాయి. మహోత్సవాల రెండవ రోజున సాయంత్రం జరిగిన దివ్యబలిపూజకు కుర్నూల్ మేత్రాసన పీఠాధిపతి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు మరియు విజయవాడ పీఠకాపరి మహా పూజ్య తెలగతోటి రాజారావు గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలిపూజను సంనర్పించారు.

పండుగకు విచ్చేసిన విశ్వాసులకు ఆయన అమూల్యమైన దైవ సందేశాన్ని అందించారు.

పూజానంతరం మహా పూజ్య రాజారావు గారు మహా పూజ్య జ్వాన్నెస్ గారిని సత్కరించి కృతఙ్ఞతలు తెలియజేసారు.