కార్డినల్ రాఫెల్ మెర్రీ వార్షికోత్సవంలో పాల్గొన్న వారితో సమావేశమైన పోప్

దేవుని సేవకుడు Rafael Merry del Val, 160వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా, పోప్ లియో 1865లో లండన్‌లో జన్మించిన దివంగత కార్డినల్తో అనుసంధానించబడిన ఒక బృందాన్ని కలిశారు.
కార్డినల్ మెర్రీ డెల్ వాల్ మిషన్ మరియు వారసత్వం గురించి పోప్ మాట్లాడారు.
ఎన్నో సవాళ్లు ఉన్న సమయంలో హోలీ సీ దౌత్య సేవలో ఒక సాధనంగా వారిని అభివర్ణించారు.
వీరి తండ్రి స్పానిష్ దౌత్యవేత్త, సార్వత్రిక వాతావరణంలో పెరిగారు
13 వ పోప్ లియో వీరిని తన అపోస్టోలిక్ ప్రతినిధిగా కెనడాకు పంపారు మరియు ఆయన పోంటిఫికల్ ఎక్లెసియాస్టికల్ అకాడమీలో చదువుకున్నారు.
ప్రస్తుతం 325వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న అకాడమీకి నాయకత్వం వహించారు.
38 సంవత్సరాల చిన్న వయస్సులో, పదవ సెయింట్ పియస్ పోప్ అతన్ని కార్డినల్‌గా నియమించారు, వాటికన్ విదేశాంగ కార్యదర్శిగా నియమించారు.
వీరి విశ్వసనీయత, విచక్షణ మరియు అంకితభావం ఇరవయ్యవ శతాబ్దపు పోంటిఫికల్ దౌత్యంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా చేసింది.
విదేశాంగ కార్యదర్శిగా కూడా, కార్డినల్ మెర్రీ డెల్ వాల్ రోమ్‌లోని Trastevere జిల్లాలోని పిల్లలు మరియు యువకులతో పనిచేశారు