కాన్స్టాంటినోపుల్ పితృస్వామ్య ప్రతినిధి బృందంతో సమావేశమైన పోప్

రోమన్ కతోలిక  సంఘానికి పాలక పునీతులైన పేతురు, పౌలుల మహోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 28 న కాన్‌స్టాంటినోపుల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధి బృందంతో పోప్ లియో సమావేశమైయ్యారు 

ఈ రెండు సంఘాల పాలక పునీతుల మహోత్సవ సందర్భంగా ఇప్పటికే ఉన్న సహవాస బంధం, అపోస్తలులైన పేతురు, అంద్రేయలను ఐక్యం చేసిన సహోదర బంధానికి ప్రతీకగా ఉన్నది.

శతాబ్దాల అపార్థాలు, విభేదాల తర్వాత, రోమ్, కాన్‌స్టాంటినోపుల్ సోదర సంఘాల మధ్య నిజమైన చర్చ మళ్ళీ మొదలవడానికి పోప్ పాల్ VI మరియు ఎక్యుమెనికల్ పాట్రియార్క్ అథెనాగోరస్ తీసుకున్న ధైర్యవంతమైన, దార్శనిక చర్యలే కారణం. 

ఎక్యుమెనికల్ పేట్రియార్క్, పరిశుద్ధ బర్తోలోమియో గారు, కతోలిక సంఘము పట్ల చూపిన సాన్నిధ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను అని పోప్ అన్నారు

 ఆయన దివంగత పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలలో వ్యక్తిగతంగా పాల్గొన్నారు. అంతేకాకుండా, నా పోంటిఫికేట్ ప్రారంభోత్సవ దివ్యపూజా బలిలో కూడా ఆయన పాల్గొన్నారు.

ఇప్పటివరకు సాధించిన ప్రగతిని కృతజ్ఞతతో గుర్తుచేసుకుంటూ, మన సంఘాల మధ్య పూర్తి ఐక్యతను పునరుద్ధరించడానికి నేను కట్టుబడి ఉన్నానని మీకు హామీ ఇస్తున్నాను.