కర్నూల్ మేత్రాసనంలో చెరసాల పరిచర్య వార్షిక సమావేశం

PMI MEETING
PMI MEETING

కర్నూల్ మేత్రాసనంలో చెరసాల పరిచర్య వార్షిక సమావేశం


భారత చెరసాల పరిచర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం 28 ఫిబ్రవరి 2024 న కర్నూల్ మేత్రాసనంలో చెరసాల పరిచర్య వార్షిక సమావేశం నిర్వహించారు .కర్నూల్  మేత్రాసన సమన్వయకర్త గురుశ్రీ ఎస్.భాస్కర్  గారి సారధ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమన్వయకర్త గురుశ్రీ పసల లహస్త్రాయ గారి అద్యక్షతన  ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఎన్నో  ఏళ్లుగా నిస్వార్థమైన సేవ చేస్తూ ఖైదీలలో మార్పు కొరకు పాటుపడుతూ, వారికొరకు ప్రార్థిస్తున్నా PMI(భారత చెరసాల పరిచర్య ) సభ్యులు పాల్గొన్నారు.
   
ప్రభు యేసుని అపారమైన ప్రేమ, జాలి, కరుణను  ఖైదీలకు తెలియజేసేలా PMI(భారత చెరసాల పరిచర్య ) సభ్యులు వారు చేసే కార్యక్రమాలను వివరించారు. పవిత్ర గ్ర౦థమైన బైబిలులోని శ్రేష్ఠమైన పాత్రల గురి౦చి ఖైదీలకు వివరిస్తునట్లు ఒక సహోదరి చెప్పారు.   

ఈ కార్యక్రమంలో  చెరసాల పరిచర్య స్వచ్చంద కార్యకర్తలు పాల్గొని వారి అమూల్యమైన సూచనలను, ఎదురుకుంటున్న సవాళ్లను  తెలియజేసారు.

ఈ చెరసాల పరిచర్య  సమావేశం "పరిశుద్ధ పోపు గారి 2025 జూబిలీ సంవత్సర సందర్బంగా  మరియు తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య చెరసాల పరిచర్య విభాగ అధ్యక్షులు కార్డినల్  మహా పూజ్య అంతోని పూల గారి ఆదేశాల మేరకు జరుగుతున్నాయని RVA తెలుగు విభాగానికి తెలియచేసారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer