కర్నూలు మేత్రాసనంలో CRI సమావేశం

కర్నూలు మేత్రాసన CRI సమావేశం జులై 17 ,2024 న కర్నూలు, జీవసుధ పాస్టరల్ సెంటర్ లో   నిర్యహించడం జరిగింది.

కర్నూలు మేత్రానులు మహా పూజ్య గోరంట్ల జ్వానేస్ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా విచ్చేసారు.

137 మఠవాసులు , 20 మంది గురువులు,3 బ్రదర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు 

"ది రోల్ అఫ్ ది రిలీజియస్ ఇన్ ది చర్చి" - "శ్రీసభల లో దైవాంకితుల పాత్ర" అనే నేపథ్యం పై పాఠాధిపతులు చకట్టి సందేశాన్ని అందించారు.

గురువులు,మఠవాసులు తమ సేవలను మారుమూల గ్రామాలలో కూడా పంచాలని, కుటుంబాలని సందర్శించాలని, ప్రజలను చైతన్యవంతులను చేయాలని సాంఘీకంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా ప్రజలను అన్ని విధాలుగా ప్రోత్సహించి క్రీస్తుని సాధనాలుగా  దైవాంకితులు తయారుకావాలని పీఠాధిపతులు పిలుపునిచ్చారు.

కర్నూలు CRI అధ్యక్షులు గురుశ్రీ గుండిగ బాలస్వామి ఆమ్, గోసుపాడు విచారణ కర్తలు కర్నూలు మేత్రాసనంలో దైవాంకితులు చేస్తున్న సేవలను పీఠాధిపతులు తెలియచేసారు.

మేత్రానులవారు ఇతర గురువులతో కలిసి దివ్యబలి పూజను సమర్పించి కర్నూలు పీఠంలోని దైవాంకితులందిరి కొరకు ప్రత్యేకంగా ప్రార్ధించారు.

కర్నూలు CRI అధ్యక్షులు పీఠాధిపతులని సత్కరించి కృతజ్ఞతలు తెలియచేసారు.