కర్నూలులోని డాన్ బోస్కో టెక్నికల్ స్కూల్ ను సందర్శించిన ప్రాంతీయ పాలనాధికారి

స్కూల్ ను సందర్శించిన ప్రాంతీయ పాలనాధికారి

కర్నూలులోని డాన్ బోస్కో టెక్నికల్ స్కూల్ ను సందర్శించిన ప్రాంతీయ పాలనాధికారి

డాన్ బోస్కో గారి స్ఫూర్తితో ముందుకు సాగుదామని డాన్ బోస్కో సంస్థల దక్షిణాసియా ప్రాంతీయ పాలనాధికారి Rev. Fr. బిజు మైఖేల్ పులియన్మక్కల్, SDB పిలుపునిచ్చారు. ప్రాంతీయ సందర్శనలో భాగంగా ఆయన ఆదివారం కర్నూలులోని డాన్ బోస్కో టెక్నికల్ స్కూల్ లో డాన్ బోస్కో పూర్వ విద్యార్థులు, మధ్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఆరేళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి వివరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు వారి అనుభవాలు, సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమానికి డాన్ బోస్కో (కర్నూలు) టెక్నికల్ స్కూల్ డైరెక్టర్ ఫాదర్ సంజయ్, పూర్వ విద్యార్థుల జాతీయమండలి సభ్యులు పామిశెట్టి బాలస్వామి, మధు, ఏసన్న, గుండ్రెడ్డి జయచంద్రా రెడ్డి, శ్రీమతి గుండ్రెడ్డి కుమారి, సంగిపాగి అంతోని, మత్తయ్య, గంధం విజయ్, జార్జి, ఎం‌.మధు తదితరులు పాల్గొన్నారు.