ఏలూరు మేత్రాసనానికి ముగ్గురు నూతన గురువులు

ఏలూరు పీఠం, అమలోద్భవిమాత బృహత్ దేవాలయము నందు జూలై 25 ,2024 న ఉదయం 10 గంటలకు గురుపటాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది.

హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య పూల ఆంతోని తండ్రి గారు దివ్యబలి పూజను సమర్పించారు 

ఖమ్మం పీఠాధిపతులు మహా పూజ్య సగిలి ప్రకాష్ తండ్రి గారు దివ్యబలి పూజలో ఉపోద్గాతం చెబుతూ " గురువుకు ఉన్న ప్రాముఖ్యతను, ప్రజలు ఎలా గురువును గౌరవిస్తారో, దేవుడు గురువును ఎలా అభిషేకిస్తారో అని గురుత్వం యొక్క విశిష్ఠతను" చక్కగా వివరించారు. 

నల్గొండ పీఠాధిపతులు మహా పూజ్య కరణం ధమన్ కుమార్ తండ్రి గారు ప్రసంగంలో మొదటిగా 11 వ పీఠాధిపత్య వార్షికోత్సవము జరుపుకుంటున్న మహా పూజ్య పొలిమెర జయరావు తండ్రిగారిని అభినందించారు, 
రెండవదిగా ఏలూరు మేత్రాసన సమాచార కేంద్ర ఏర్పాటు చేసిన మేత్రానులను, దివ్యవాణి టీవీ సిబ్బందిని అభినందించారు, 
మూడవదిగా గురు పాటాభిషేక ప్రాముఖ్యతను తెలియచేస్తూ నూతన గురువుల భాద్యతలను వారికి తెలియచేసారు. 
 
ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య పొలిమెర జయరావు తండ్రి గారు ఉపగురువులైన గుమ్మళ్ళ మరియజొజి, కౌజు బాలరాజు మరియు నారెడ్ల విద్యాసాగర్లు గురువులుగా అభిషేకించి ఆశీర్వదించారు.

నూతన గురువు గురుశ్రీ కౌజు బాలరాజు గారు తనని గురువుగా ఎన్నుకొనిన ఆ దేవాదిదేవునికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు, వారిని ఎంతగానో ప్రోత్సహించిన ఏలూరు పీఠాధిపతులకు, విచ్చేసిన కార్డినల్ గారికి, పీఠాధిపతులకు, బెంగళూరు వికార్ జనరల్ గురుశ్రీ చిన్నపన్ గారికి , మేత్రాసన గురువులకు,మఠవాసులకు  శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియచేసారు.

ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య పొలిమెర జయరావు తండ్రి గారిని కార్డినల్ గారు మరియు నల్గొండ పీఠాధిపతులు సత్కరించారు. 
అనంతరం మేత్రాసన గురువులు,ఇతర గురువులు, మరియు విశ్వాసులు 11 వ పీఠాధిపత్య వార్షికోత్సవము జరుపుకుంటున్న మహా పూజ్య పొలిమెర జయరావు తండ్రిగారిని గజమాలలతో సత్కరించారు.