ఉక్రెయిన్ అధ్యక్షుడుతో సమావేశమైన పోప్ లియో

మంగళవారం జులై 8 మధ్యాహ్నం, కాస్టెల్ గాండోల్ఫోలోని పాపల్ నివాసంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పోప్ లియో వ్యక్తిగతంగా కలిశారు.
ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని సంభాషణ ద్వారా శాంతిని స్థాపించడానికి ప్రయత్నించాలని ఈ సమావేశంలో చర్చించారు.
హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఉక్రెయిన్‌లో యుద్ధానికి న్యాయమైన మరియు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నాలపై సంభాషణ కేంద్రీకృతమై ఉంది.
యుద్ధ బాధితుల పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశాడు మరియు ఉక్రేనియన్ ప్రజలకు తన ప్రార్థనలు మరియు నిరంతర సహాయసహకారాలు అందిస్తామని పోప్ హామీ ఇచ్చారు
ఖైదీల విడుదల మరియు వారి కుటుంబాల నుండి విడిపోయిన పిల్లల పునరుద్ధరణ లక్ష్యంగా ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్నాము అని ఆయన అన్నారు.
ఉక్రెయిన్ మరియు రష్యా ప్రతినిధులను సంభావ్య చర్చల కోసం వాటికన్‌కు స్వాగతించడానికి వాటికన్ సంసిద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.