అశ్రునివాళి

బెంగుళూరు అగ్రపీఠ విశ్రాంత పీఠాధిపతులు  మహా పూజ్య అల్ఫోన్సస్ మథియాస్ (96) జూలై 10, 2024 బుధవారం సాయంత్రం 5.20 గంటలకు బెంగుళూరులోని సెయింట్ జాన్స్ వైద్య కళాశాలలో కన్నుమూశారు.

అల్ఫోన్సస్ మథియాస్ గారు 1964-1986 వరకు చిక్మంగళూరే పీఠాధిపతిగాను మరియు 1986-1998 వరకు బెంగుళూరు అగ్రపీఠాధిపతిగా,1989, 1993లో రెండు పర్యాయాలు సీ.బీ.సీ.ఐ అధ్యక్షులుగా ఉన్నారు.అతను గురువుగా రెండవ వాటికన్ కౌన్సిల్‌కు హాజరయ్యారు.

అల్ఫోన్స్ గారు 1928 జూన్ 22న కర్నాటక, సౌత్ కెనరా జిల్లా, పంగలాలో డియెగో మథియాస్ మరియు ఫిలోమినా డిసౌజా దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించారు.

మంగళూరు,జెప్పు సెయింట్ జోసఫ్ సెమినరీలో జూన్ 1945 న మేత్రాసన గురువు కావాలని     చేరారు. 

మంగళూరు సెమినరీలో అతని తెలివితేటలను గమనించిన సుపీరియర్  రెండున్నరేళ్లలోపు అల్ఫోన్స్ గారిని పొంటిఫికల్ సెమినరీకి చదువుల కోసం శ్రీలంకలోని కాండీకు పంపారు, అక్కడ తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్రం అభ్యసించారు.

1954 ఆగస్టు 24న క్యాండీలో గురువుగా నియమితులయ్యారు.

స్వదేశానికి వచ్చాక అల్ఫోన్సస్ గారి మొదటి సహాయక గురువుగా బజ్పేలోని  సెయింట్ జోసఫ్స్ విచారణకు నియమించారు.అక్కడ సుమారు ఒక సంవత్సరం సేవ తర్వాత, అతను 1955లో కానన్ లా మరియు ఇంటర్నేషనల్ సివిల్ లాలో ఉన్నత చదువుల కోసం రోమ్‌కు పంపబడ్డాడు.

అర్బనియన్ విశ్వవిద్యాలయం మరియు లాటరన్ విశ్వవిద్యాలయం నుండి కానన్ లా మరియు ఇంటర్నేషనల్ సివిల్ లాలో డాక్టరల్ అధ్యయనాలను చేపట్టాడు మరియు DD, JUD, PhL డిగ్రీలను పొందారు. 

గురుశ్రీ అల్ఫోన్సస్ 1959లో మంగుళూరు మేత్రాసనానికి తిరిగి వచ్చారు మరియు అప్పటి అగ్ర పీఠాధిపతులు మహా పూజ్య రేమండ్ డి'మెల్లో గారి కార్యదర్శిగా మరియు మేత్రాసన ఛాన్సలర్‌గా పనిచేశారు.

35 సంవత్సరాల వయస్సులోనే జగత్గురువులు పోప్ సెయింట్ పాల్ VI చేత 16 నవంబర్, 1963న కొత్తగా సృష్టించబడిన చిక్మంగళూరు మేత్రాసనానికి మొదటి పీఠాధిపతిగా  నియమితులయ్యారు మరియు 5 ఫిబ్రవరి, 1964నచిక్మంగళూరులోని సెయింట్ జోసఫ్ కథడ్రల్‌లో పీఠాధిపతిగా అభిషేకింపబడ్డారు.

పీఠాధిపతిగా అల్ఫోన్సస్ గారు 23 సంవత్సరాల సేవలో శ్రమించి, తన మిషన్‌లో విజయం సాధించారు 

12 సెప్టెంబర్ 1986న బెంగుళూరు అగ్రపీఠాధిపతిగా నియమితులయ్యారు. 
3 డిసెంబర్ 1986న మెట్రోపాలిటన్ అగ్రపీఠాధిపతిగా అభిషేకింపబడ్డారు.

69 సంవత్సరాల వయస్సులో, పదవీ విరమణకు ఇంకా 6 సంవత్సరాలు ఉండగానే, అతను తన రాజీనామాను రోమ్‌కు పంపారు, ఆరోగ్యం సరిగా లేదని పేర్కొంటూ అది 24 మార్చి 1998న ఆమోదించబడింది.

1989, 1993లో రెండు పర్యాయాలు సీ.బీ.సీ.ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1974-1982 బెంగుళూరులోని సెయింట్ జాన్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చైర్మన్ గాను  మరియు సెయింట్ జాన్స్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో చాలా బాధ్యత వహించారు

ఫెడరేషన్ ఆఫ్ ది ఆసియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) సోషల్ కమ్యూనికేషన్స్ కమీషన్ చైర్మన్; మనీలా-రేడియో వేరితాస్ అధ్యక్షుడు; పొంటిఫికల్ కమిషన్ ఫర్ సోషల్ కమ్యూనికేషన్స్ మరియు కౌన్సిల్ ఫర్ జస్టిస్ అండ్ పీస్, వాటికన్ సభ్యుడుగా తన సేవలు అందించారు