అమెరికా సామాజిక మంత్రిత్వ శాఖ నాయకులకు సందేశాన్ని పంపిన పోప్ ఫ్రాన్సిస్

జూబ్లీ సంవత్సరం నిరీక్షణను వ్యవస్థీకృతం చేసేందుకు గొప్ప అవకాశమని జనవరి 28 న  యునైటెడ్ స్టేట్స్‌లో జరుగుతున్న కాథలిక్ సోషల్ మినిస్ట్రీ గాదరింగ్ (CSMG)కి పొప్ ఫ్రాన్సిస్ సందేశం  ఇచ్చారు 

ఈ వార్షిక సమావేశాన్ని USCCB న్యాయం మరియు శాంతి సెక్రటేరియట్, యునైటెడ్ స్టేట్  కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ పది ఇతర విభాగాలు మరియు ఇరవై జాతీయ కాథలిక్ సంస్థల సహకారంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.

“మిషనరీస్ ఆఫ్ హోప్, అడ్వకేట్స్ ఫర్ జస్టిస్.”ఈ వార్షిక సమావేశం నేతృత్వం.  

వీరు ఎల్లపుడు పేదల సేవలో ,సామూహిక మంచి కొరకు కృషిచేస్తుంటారు అని పోప్ ఫ్రాన్సిస్ US సామాజిక పరిచర్య నాయకుల సేవను ప్రశంశించారు. 

చరిత్ర యొక్క ప్రధాన పాత్రధారులుగా ఉండండి, భయపడవద్దని ప్రోత్సహిస్తూ, "సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంలో మనం విఫలమైతే, ఈ ప్రపంచంలోకి వచ్చే ప్రతి వ్యక్తి యొక్క,  గౌరవానికి  మనం హామీ ఇవ్వలేము" అని హెచ్చరించారు 

కాథలిక్ సోషల్ మినిస్ట్రీ గ్యాదరింగ్‌లో పాల్గొన్న వారందరినీ "మీ పూర్వీకులు ఉన్నట్లుగా నిరీక్షణా యాత్రికులుగా కొనసాగడానికి ధైర్యం కలిగి ఉండాలని" పొప్ ఫ్రాన్సిస్  ముగ్గించారు