సృష్టి సంరక్షణ కోసం ప్రపంచ ప్రార్థన దినోత్సవ ఇతివృత్తాన్ని ప్రకటించిన పొప్ ఫ్రాన్సిస్

ఈ సంవత్సరం సెప్టెంబర్ 1న జరుపుకోనున్న సృష్టి సంరక్షణ కోసం ప్రపంచ ప్రార్థన దినోత్సవ వేడుకలకు పోప్ ఫ్రాన్సిస్ ఎంచుకున్న ఇతివృత్తాన్ని సమగ్ర మానవ అభివృద్ధిని ప్రోత్సహించే డికాస్టరీ ప్రకటించింది. 

2025 సంవత్సరానికి “శాంతి మరియు నిరీక్షణా బీజాలు " అనే నేపధ్యాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఎంచుకున్నారు.

సృష్టి సంరక్షణ కొరకు ప్రపంచ ప్రార్థన దినోత్సవం మరియు లౌదాతొసి ఎన్సైక్లికల్ 10వ వార్షికోత్సవం ఈ 2025 జూబ్లీ సంవత్సరంలో జరగనున్నాయి

సృష్టి కాలం అనేది ఏటా సెప్టెంబర్ 1 (సృష్టి సంరక్షణ కోసం ప్రార్థన దినం) నుండి అక్టోబర్ 4 (సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి పండుగ) వరకు జరిగే ఒక క్రైస్తవ ప్రక్రియ .

సమగ్ర మానవ అభివృద్ధిని ప్రోత్సహించే డికాస్టరీ 2025 సృష్టి కాలం యొక్క ఇతివృత్తం "సృష్టితో శాంతి" అని సోమవారం ఏప్రిల్ 7 న  విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొనింది

శాంతికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటానికి ప్రపంచంలోని క్రైస్తవులు కలిసి ప్రార్థించాలని ఈ డికాస్టరీ ఆహ్వానించింది.