పర్యావరణ సంక్షోభానికి ఆలోచనాత్మక దృష్టి అవసరమన్న పోప్

Castel Gandolfoలో తన వేసవి సెలవులను ప్రారంభించిన కొద్ది రోజులకే, సృష్టి సంరక్షణ కొరకు మొదటి దివ్యబలిపూజను జులై 9 న సమర్పించారు.
రోమ్ సమీపంలోని పాపల్ వేసవి నివాసంలో ఉన్న విద్యా కేంద్రమైన లౌదాతో సీ’ (Laudato Si') గ్రామంలో ఈ దివ్యబలిపూజ జరిగింది మరియు ఆ కేంద్ర సిబ్బంది దీనిలో పాల్గొన్నారు
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పీడిస్తున్న అనేక ప్రకృతి వైపరీత్యాల గురించి పోప్ లియో విచారం వ్యక్తం చేశారు, ఇవి “తరచుగా మానవ అతిక్రమణ మరియు మన జీవన విధానం వల్ల సంభవిస్తాయి.”
సృష్టి సంరక్షణ అనేది మన విశ్వాస జీవితంలో అంతర్భాగం. ఇప్పుడు కేవలం సంభాషణలు, చర్చలు కాదు, ఆచరణాత్మక చర్యలతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రేమతో, పట్టుదలతో కృషి చేయడం ద్వారా, మనం అనేక న్యాయ బీజాలను నాటవచ్చు. దీనివల్ల శాంతి వృద్ధి చెందడానికి, ఆశలు చిగురించడానికి తోడ్పడగలం.