కోయలకుంట్ల విచారణలో మొక్కలు నాటే కార్యక్రమం

జులై 14 న కర్నూలు మేత్రాసనం కోయలకుంట్ల పునీత జాన్ పాల్ II విచారణ ప్రాంగణంలో విచారణ కర్తలు గురుశ్రీ కొమ్ము లూర్దు మరియు జేఎంజే కాన్వెంట్ సుపీరియర్ సిస్టర్ జాన్ మేరీ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ నిమ్మితమై ప్రకృతిలో జరిగే మార్పుల దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒకరు తమవంతుగా వాతావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటాలనే సదుదేశంతో విచారణ కర్తలు, మఠవాసులు, పాఠశాల బాలబాలికలు, బోర్డింగ్ పిల్లలు దీనిలో చురుకుగా పాల్గొన్నారు.
తమ వంతుగా ప్రకృతిని కాపాడుతాము అని చిన్నారి పిల్లలు ముందుకు రావడం హర్షించదగిన విషయమని విచారణ గురువులు అన్నారు