వలసదారులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారితో సమావేశమయ్యారు

వలసదారులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారితో సమావేశమయ్యారు


పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మంగళవారం మధ్యాహ్నం సెనెగల్ మరియు గాంబియా నుండి వచ్చిన రచయితలు మరియు వలసదారులతో సమావేశమయ్యారు.


వలసదారుల బృందం కాసా శాంటా మార్టాను సందర్శించారు.ఈ సమావేశంలో ప్రధాన వ్యక్తులు ఇద్దరు యువకులు. సెనెగల్ నుండి వచ్చిన ఇబ్రహీం లో మరియు గాంబియా నుండి వచ్చిన  ఎబ్రిమా కుయాతే, ఇద్దరూ ఐరోపాకు రావడానికి లిబియా మీదుగా ప్రయాణించారు.


ఇబ్రహీం "పనే ఇ అక్వా" రచయిత. పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమైన వారిలో గురుశ్రీ  మట్టిగా  ఫెరారీ ఉన్నారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వలసదారుల కథలను విన్నారు. ప్రస్తుతం   ప్రతి ఒక్కరు  ఏమి చేస్తున్నారో మరియు వారు ఎలా జీవిస్తున్నారో తెలుసుకున్నారు .


నవంబరు 2023లో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు ఇదివరకే  కలుసుకున్న వలసదారులలో ఒకరైన పాటో చెప్పినటువంటి తన కథ అందరిని మనస్సాక్షిని కదిలించింది.  గత సంవత్సరం పాటో కుటుంబం వలసవెళ్తుండగా  ఎడారిని దాటుతున్నప్పుడు  పాటో భార్య ఫాతి మరియు కుమార్తె మేరీ దాహంతో మరణించారు.  


అయితే, ఇలాంటి నరక అనుభవాల కథలు, వలస వచ్చినవారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారితో తో పంచుకోవాలనుకునే వారి ఆశ కథలతో మిళితం చేయబడ్డాయి.


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer