వేడుక | జీసస్ యూత్

వేడుక | జీసస్ యూత్
తెలుగు ప్రాంతీయ "జీసస్ యూత్" 30 సంవత్సరాల వేడుకలు సెప్టెంబర్ 13,14 తేదీలలో జరగనున్నవి. తెలుగు ప్రాంతీయ జీసస్ యూత్ సభ్యులు "వేడుక" అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ స్కూల్ లో ఈ కార్యక్రమం జరగనున్నది.
రెండు రోజుల పాటూ జరిగే ఈ కార్యక్రమంలో మహా ఘన కార్డినల్ పూల అంతోనీ గారు మరియు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ పాల్గొననున్నారు.
జీసస్ యూత్ తెలుగు ప్రాంతీయ సమన్వయకర్త శ్రీ ఉదయ్ మాట్లాడుతూ " 1995లో మొదలైన ఈ ప్రయాణంలో ఆ దేవాది దేవుడు మమ్మలని విశ్వాసం, పరివర్తన మరియు ప్రభు యేసుని మార్గంలో నడిపించారు అని, ఈ 30 సంవత్సరాల వార్షికోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయి మాత్రమే కాకుండా ఇది దేవుని కృపకి మరియు అయన శాశ్వతమైన ప్రేమకు నిదర్శనం అని అన్నారు. ఈ ప్రయాణం లెక్కలేనన్ని యువత జీవితాలకు సాక్ష్యంగా నిలిచింది అని అన్నారు.
శ్రీకాకుళం జీసస్ యూత్ సభ్యులు "ప్రియాంకా మరియు లాజరు" లు తమ సహాయాన్ని అందిస్తున్నారు. ప్రియాంకా మాట్లాడుతూ " ఈ వేడుక కార్యక్రమం గత 30 సంవత్సరాలుగా దేవుని కృపకు మరియు కృతజ్ఞతా సమయంగా రూపొందించబడ్డాయి" అని అన్నారు. అందరు ఈ వేడుక కార్యక్రమం కొరకు ప్రార్ధించాలని కోరారు.
Article and design by M.kranthi swaroop