ఘనంగా ముగిసిన జీసస్ యూత్ వారి "వేడుక"

 

ఘనంగా ముగిసిన జీసస్ యూత్ వారి "వేడుక" 

తెలుగు ప్రాంతీయ "జీసస్ యూత్" 30 సంవత్సరాల వేడుకలు ఘనంగా ముగిసాయి. ఈ  వేడుకలు సెప్టెంబర్ 13,14  రెండు రోజుల పాటూ సికింద్రాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ స్కూల్ లో జరిగాయి. 
  
మొదటి రోజు కార్యక్రమంలో  హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా ఘన కార్డినల్ పూల అంతోనీ గారు , శ్రీకాకుళం పీఠాధిపతులు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారు మరియు విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు పాల్గొని ఇతర  గురువులతో కలసి దివ్యబలిపూజను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో జీసస్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. జీసస్ యూత్ సభ్యులు మధురమైన గీతాలను ఆలపించారు. సాయంతం జరిగిన ప్రత్యేకమైన ఆరాధన కార్యక్రమం భక్తియుతంగా సాగింది.   

రెండవరోజు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారు ఇతర  గురువులతో కలసి దివ్యబలిపూజను సమర్పించారు. అనంతరం జీసస్ యూత్ నాయకులు  వివిధ యువత కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి "జీసస్ యూత్ పెద్దలు" వారి కుటుంబాలతో సహా పాల్గొని తమ నిబద్ధతను చాటుకున్నారు. వారి పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆద్యంతము కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరిగింది. రెండవరోజు సాయంతం ముగింపు ప్రార్థనలతో ఈ కార్యక్రమం ముగిసింది. 

 తెలుగు రాష్ట్రాలలో "జీసస్ యూత్" వారు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలోనే వారి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి విచారణలో జీసస్ యూత్ ను ప్రారంభించాలని కోరుకుంటూ మీ "అమృతవాణి - రేడియో వెరితాస్ ఆసియ తెలుగు".    

Article and designe by M kranthi Swaroop