వివాహం యొక్క పవిత్రతకు శ్రీసభ  కట్టుబడి ఉంది -  ఫిలిప్పీన్ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య

వివాహం యొక్క పవిత్రతకు శ్రీసభ  కట్టుబడి ఉంది -  ఫిలిప్పీన్ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య

ఫిలిప్పీన్స్‌లోని కథోలిక పీఠాధిపతుల సమాఖ్య  దేశంలో సంపూర్ణ విడాకుల బిల్లుకు వ్యతిరేకంగా తన వైఖరిని పునరుద్ఘాటించింది.

జూలై 11న ఫిలిప్పీన్స్‌లోని కథోలిక పీఠాధిపతుల (బిషప్‌) కాన్ఫరెన్స్ (CBCP) దేశంలో  విడాకులపై జరుగుతున్న చర్చను ఉద్దేశించి ఒక మతపరమైన ప్రకటనను విడుదల చేసింది. అటువంటి చట్టాన్ని అవలంబించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కుటుంబ విలువలను ఉదహరిస్తూ, విడాకులను చట్టబద్ధం చేయడానికి తొందరపడకుండా హెచ్చరిస్తున్నారు.ఏ నేషన్ ఫౌండెడ్ ఆన్ ఫ్యామిలీ, ఎ ఫ్యామిలీ ఫౌండెడ్ ఆన్ మ్యారేజ్' అనే శీర్షికతో చేసిన ప్రకటన, వివాహం యొక్క పవిత్రతకు చర్చి కట్టుబడి ఉందని తెలిపారు.

ఫిలిప్పీన్స్ లో విడాకులు ఇప్పటికీ చట్టవిరుద్ధం. దీనికి కారణం "వివాహాన్ని జీవిత భాగస్వామికి, అలాగే దేవునికి మరియు సమాజానికి పవిత్రమైన నిబద్ధతగా భావించే కథోలిక శ్రీసభ.

ఈ సందర్భముగా CBCP ప్రెసిడెంట్ పీఠాధిపతులు పాబ్లో విర్గిలియో డేవిడ్ శ్రీసభ యొక్క వైఖరిని నొక్కిచెప్పారు. సివిల్ విడాకులు చట్టబద్ధమైన దేశాల్లో "నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్" ప్రకారం, "మొదటి వివాహానికి వైఫల్యం రేటు దాదాపు 48%, రెండవ వివాహానికి 60% మరియు మూడవ వివాహాలకు 70%" అని పేర్కొంటూ పీఠాధిపతులు విఫలమైన వివాహాల యొక్క గణాంక సంభావ్యత గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. విడాకులను చట్టబద్ధం చేయడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాల గురించి ఈ గణాంకాలు లోతుగా పరిశీలించాలని వారు కోరారు .

విడాకుల చట్టబద్ధత కోసం ఒత్తిడి చేసే బదులు సంక్షోభాల నుండి బయటపడిన తర్వాత వారి బంధాన్ని బలోపేతం చేసుకున్న జంటల కథలను వినడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఎపిస్కోపల్ సమావేశం సూచించింది.
సివిల్ విడాకులను చట్టబద్ధం చేసే దిశగా ఏదైనా తొందరపాటు జరిగినా ఫిలిపినో సమాజంలోని "పరిశుద్ధ వివాహ బంధం" అనే ఈ పునాది కోణాన్ని దెబ్బతీయవచ్చని పీఠాధిపతులు అన్నారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer