ఘనంగా వివాహ పునరుద్ధరణ సదస్సు
ఘనంగా వివాహ పునరుద్ధరణ సదస్సు
సెయింట్ క్లారెట్ ధ్యాన బృందం ఆగస్టు 25, 2024న గుంటూరు మేత్రాసనంలోని ఓలేరు విచారణ లోని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ దేవాలయంలో (St. Francis Xavier Church) సంతోషకరమైన 'వివాహ పునరుద్ధరణ సదస్సు'ను నిర్వహించారు. విచారణకర్తలు గురుశ్రీ సేవి CMF, గారి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
సెయింట్ క్లారెట్ ధ్యాన బృంద డైరెక్టర్ గురుశ్రీ మార్టిన్ CMF, మరియు సహాయక డైరెక్టర్ గురుశ్రీ చిన్నాన్న CMF, గారు పాల్గొని ఈ 'వివాహ పునరుద్ధరణ సదస్సు'ను ఘనంగా నిర్వహించారు.
అధిక సంఖ్యలో దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోసారి దేవుని ముందు తమ వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకుని ప్రార్థనలు చేశారు. గురువులందరు దంపతులు కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
గురుశ్రీ సేవి CMF, గారు మాట్లాడుతూ "పరిశుద్ధ వివాహ బంధం" దేవునికి మరియు సమాజానికి పవిత్రమైన నిబద్ధతగా ఉందని అన్నారు.
ఈ ప్రేమ మరియు నిబద్ధత యొక్క ఈ ప్రత్యేక సదస్సు పాల్గొన్న దంపతుల బంధాలను బలోపేతం చేసింది మరియు వారి ఆధ్యాత్మిక వృద్ధికి ప్రేరణనిచ్చింది.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer