అంతర్జాతీయ బాలికల దినోత్సవం

అంతర్జాతీయ బాలికల దినోత్సవం

ప్రతీ సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది.

బాలికల హక్కులు, ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించడానికి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆడపిల్లలు మన కుటుంబానికి, సమాజానికి గుండె చప్పుడు వంటి వారు . ప్రతి ఆడపిల్ల కళ్లలోనూ ప్రకాశవంతమైన రేపటి ఆశ ఉంటుంది. భవిష్యత్తును మార్చే వారిగా, నాయకురాలిగా ఉండేలా వారిని శక్తివంతం చేద్దాం.
వారు అభివృద్ధి చెందడానికి అవసరమైన అవకాశాలు, మద్దతును కలిగి ఉండేలా చూడడం మన బాధ్యత.  

మన దేశంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అబ్బాయే పుట్టాలనే ఆలోచన నుంచీ... అమ్మాయి పుడితే బాగుండు అనుకునే మనస్తత్వం కనిపిస్తోంది.
బాలికల విద్య, శ్రేయస్సుపై పెట్టుబడి పెట్టడం మన ప్రపంచ భవిష్యత్తుకు పెట్టుబడి అని గుర్తుంచుకోండి. అందరికి అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు!