ఇది అనేకుల పాపపరిహారమునకై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము.


మత్తయి సువార్త 26:19-28

19.యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్క భోజనమును సిద్ధపరచిరి.

20. సాయంకాలము కాగా, ఆయన పన్నిదరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను.

21. వారు భుజించుచుండ యేసు “మీలో ఒకడు నన్ను శత్రువు లకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగ చెప్పు చున్నాను” అనెను.

22. అప్పుడు వారందరు మిగుల చింతించి “ప్రభూ! నేనా?” అని ఒక్కొక్కరు అడుగ సాగిరి.

23. అందులకు ఆయన 'నాతోపాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును.

24. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్యకుమారుడు చంపబడును. కాని మనుష్యకుమారుని అప్పగించువానికి అయ్యో అనర్ధము! అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యెడిది” అనెను.

25. అప్పుడు ఆయనను అప్పు గింపనున్న యూదా, “బోధకుడా! నేనా”? అని అడుగగా “నీవే చెప్పుచున్నావు” అని యేసు సమాధానము ఇచ్చెను.

26. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి, త్రుంచి, తన శిష్యులకు ఇచ్చుచు, “దీనిని మీరు తీసికొని భుజింపుడు. ఇది నా శరీరము” అనెను.

27. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని, కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరు అందరు త్రాగుడు.

28. ఇది అనేకుల పాపపరిహారమునకై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము.29. ఇది మొదలుకొని మీతో గూడ నాతండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షారసము పానము చేయువరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను” అనెను.
30. వారొక కీర్తన పాడి ఓలీవు కొండకు వెళ్ళిరి.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer