వార్తలు

  • మెక్సికో వరద బాధితుల కొరకు ప్రార్థించిన పోప్ లియో

    Oct 28, 2025
    మెక్సికో వరద బాధితుల కొరకు ప్రార్థించిన పోప్ లియో

    సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో వేలాది మంది యాత్రికులతో త్రికాలప్రార్థన అనంతరం, పోప్ లియో తూర్పు-మధ్య మెక్సికో ప్రజల కొరకు ప్రార్థించారు.

    అక్కడ అక్టోబర్ 6-11 వరకు వినాశకరమైన వరదలు సంభవించాయి.

    కనీసం 76 మంది మరణించారు, ఎంతో మంది తప్పిపోయారు మరియు 100 కంటే ఎక్కువ కమ్యూనిటీలు రోడ్డున పడ్డాయి

    ఈ విపత్తు కారణంగా బాధపడుతున్న కుటుంబాల కొరకు తానూ ప్రార్థిస్తున్నట్లు తెలిపారు మరియతల్లి మధ్యవర్తిత్వం ద్వారా మరణించిన వారి ఆత్మలకు నిత్యవిశ్రాంతి చేకూరాలని ప్రార్ధించారు.

    అంతేకాకుండా, యుద్ధం,హింసతో బాధపడుతున్న ప్రదేశాలలో నివసించే వారందరినీ పోప్ లియో జ్ఞాపకం చేసుకున్నారు

    జపమాలను జపించడం ద్వారా యుద్ధ బాధితులైన పిల్లలు, తల్లితండ్రులు మరియు వృద్ధుల బాధ మరియు ఆశను మనం మన స్వంతం చేసుకుంటాము" అని ఆయన వివరించారు.

    యుద్ధంలో దెబ్బతిన్న ప్రదేశాలలో నివసించే వారి కోసం మన మధ్యవర్తిత్వం అందించడం ద్వారా, దాతృత్వం, సంఘీభావం మరియు నిర్దిష్ట సాన్నిహిత్యం ఎలా ఉద్భవించవచ్చో పోప్ హైలైట్ చేశారు.

    “శాంతి స్థాపకులు ధన్యులు!” ప్రపంచవ్యాప్తంగా అంకితభావంతో శాంతిని నెలకొల్పాలని పోప్ పునరుద్ఘాటించారు