FABC అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో

 FABC అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో

మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో గారు జనవరి 1, 2025న ఫెడరేషన్ ఆఫ్ ఆసియా బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.  ఇది వరకు మయన్మార్ ఎపిస్కోపల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్  మహా పూజ్య  కార్డినల్ చార్లెస్ ముయాంగ్ బో, SDB గారు FABC  అధ్యక్షులుగా పని చేసారు.

ఫిబ్రవరి 22, 2024న బ్యాంకాక్‌లో జరిగిన చివరి సెంట్రల్ కమిటీ సమావేశంలో CCBI అధ్యక్షుడు మరియు గోవా ఆర్చ్ బిషప్ కార్డినల్ ఫెర్రో గారు FABC అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. FABC(ఫెడరేషన్ ఆఫ్ ఆసియా బిషప్స్ కాన్ఫరెన్స్)లో దక్షిణ, ఆగ్నేయ, తూర్పు మరియు మధ్య ఆసియా కు చెందిన పీఠాధిపతులు సభ్యులుగా ఉన్నారు.

ఫిలిప్పీన్స్‌లోని కల్లోకాన్‌కు చెందిన పీఠాధిపతులు మహా పూజ్య  పాబ్లో విర్జిలియో డేవిడ్ గారు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. టోక్యోకు చెందిన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య  టార్సిసియో కికుచి గారు రెండవసారి ఫెడరేషన్ సెక్రటరీ జనరల్‌గా తిరిగి ఎన్నికయ్యారు. డిసెంబర్ 7, 2024 వ తేదీన వాటికన్‌లో జరిగిన చివరి ఆర్డినరీ కాన్‌సిస్టరీలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వారిద్దరినీ కార్డినల్స్‌గా నియమించారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer