థాయిలాండ్‌ లో సమావేశమైన ఆసియా పీఠాధిపతులు

థాయిలాండ్‌ లో సమావేశమైన ఆసియా పీఠాధిపతులు 

 సెప్టెంబర్ 22 నుండి 26, 2025  వరకు జరిగే సినడాలిటీ పై వారం రోజుల పాటు జరిగే సెమినార్ కోసం ఆసియా అంతటా ఉన్న పీఠాధిపతులు(బిషప్‌లు) మరియు నాయకులు థాయిలాండ్‌లోని సాంప్రాన్‌లోని బాన్ ఫు వాన్(Baan Phu Waan) పాస్టోరల్ శిక్షణా  కేంద్రంలో సమావేశమయ్యారు.

ఈ సెమినార్ సోమవారం, సెప్టెంబర్ 22న భారతదేశానికి చెందిన మహా ఘన కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో గారి అధ్యక్షతన ప్రారంభమైంది. మంగళవారం, సెప్టెంబర్ 23న, మహా ఘన కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో గారు మొదటి పూర్తి రోజు సెషన్లకు అధ్యక్షత వహించారు.  సిస్టర్ లలిత థామస్, STJ, సహాయకారిగా ఉన్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన అగ్రపీఠాధిపతులు మహాపూజ్య గిల్బర్ట్ గార్సెరా గారు శ్రీసభలో సినోడల్ (సమాఖ్య సదస్సు) నాయకత్వం గురించి ప్రసంగించారు.

రెండవరోజు మహా ఘన కార్డినల్ పాబ్లో వర్జిలియో డేవిడ్ గారు సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. శ్రీమతి మోమోకో నిషిమురా గారు దీనికి సహకరించారు.

గురువారం, సెప్టెంబర్ 25న ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) సెక్రటరీ జనరల్ మహా ఘన కార్డినల్ టార్సిసియో ఇసావో కికుచి, SVD, గారు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆసియాలోని శ్రీసభలోని  బంధాలను బలోపేతం చేయడంపై CSsR ఫాదర్ విమల్ తిరిమన్న గారు మాట్లాడారు.  

ఈ కార్యక్రమం సెప్టెంబర్ 26, శుక్రవారం నాడు శ్రీలంక బిషప్ మహా పూజ్య రేమండ్ కింగ్స్లీ విక్రమసింఘే గారి అధ్యక్షతన జరగనున్నవి. ఈ కార్యక్రమంలో విశాఖ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఉడుమల బాల గారు కూడా పాల్గొన్నారు. 

Article and Design: M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer