హైదరాబాద్ అగ్రపీఠంలో ఫాతిమామాత మహోత్సవం

హైదరాబాద్ అగ్రపీఠం మే 13, 2025న, సూరారంలోని కరుణగిరి ఆలయంలో, ఫాతిమామాత మహోత్సవం ఘనంగా జరిగింది.
కరుణగిరి ఆలయ పిల్లలు శాస్త్రీయ స్వాగత నృత్యంతో నల్గొండ విశ్రాంత పీఠాధిపతులు మహా పూజ్య గోవింద జోజి గారిని మరియు గురువులను స్వాగతించారు.
పవిత్ర జపమాల మరియు ప్రార్థనలు విశ్వాసపాత్రమైన జీవితానికి రెండు ముఖ్యమైన సాధనాలు అని పీఠాధిపతులు భోదించారు.
ఈ మహోత్సవంలో దాదాపు 15 మంది గురువులు పాల్గొన్నారు. 20 మంది పిల్లలకు మొదటి సత్ప్రసాదాన్ని మరియు భద్రమైన అభ్యంగనం స్వీకరించారు.
విచారణ తెలుగు గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.
దివ్యబలి పూజ అనంతరం విచారణ కమిటీ నాయకుడు శ్రీ తలారి జయరావు విద్యా నిధి గురించి విశ్వాసులకు వివరించారు మరియు విందును గొప్పగా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దాదాపు 1500 మంది విశ్వాసులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.