సెయింట్ పీటర్స్ బాసిలికా ఇద్దరు మహిళలను తన శ్రేష్టమైన కళాకారుల బృందంలో నియమించుకుంది
సెయింట్ పీటర్స్ బాసిలికా ఇద్దరు మహిళలను తన శ్రేష్టమైన కళాకారుల బృందంలో నియమించుకుంది
వాటికన్ సిటీ సెయింట్ పీటర్స్ బాసిలికా నిర్వహణ కార్యాలయం స్థాపించబడిన తర్వాత మొదటిసారిగా దేవాలయం యొక్క ప్రత్యేక కళాకారులు మరియు కార్మికులు బృందంలో ఇద్దరు మహిళలను నియమించుకుంది.
"ఫాబ్రికా డి శాన్ పియెట్రో"(The Fabbrica di San Pietro) బాసిలికా నిర్వహణకు బాధ్యత వహించే కార్యాలయం. ఈ నిర్వహణ కార్యాలయం 500 సంవత్సరాల చరిత్ర కలది.
ప్రపంచంలోని అతిపెద్ద క్రైస్తవ దేవాలయాలలో శుభ్రపరచడం, నిర్వహణ, నిఘా మరియు రిసెప్షన్ తదితర సేవలను నిర్వహిస్తుంది. ఈ కార్యాలయంలో సుమారు 80 మంది సభ్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని కలిగి ఉంది. దీనిపేరు "సాన్‌పీట్రిని" (sanpietrini).దీనిలో చాలామంది వడ్రంగులు, మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్‌లు, ప్లంబర్లు, డెకరేటర్లు, శిల్పులు, స్టోన్ కట్టర్లు, పరంజా మరియు ఇతర సాధారణ కార్మికులు ఉన్నారు. ప్రతి రోజు 60,000 మంది ప్రజలు బాసిలికా ద్వారా వస్తున్నారని ఫ్యాబ్రికా తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
నూతనంగా నియమించిన ఇద్దరు మహిళలు ఇటలీకి చెందిన వారు. 26 మరియు 21 సంవత్సరాల వయస్సు గల ఈ ఇద్దరు స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ట్రెడిషనల్ ట్రేడ్స్ నుండి డిగ్రీ పొందారు. వారు తాపీపని మరియు అలంకరణ మరియు అలంకారమైన ప్లాస్టరింగ్‌లో నైపుణ్యం కలిగి ఉన్నారు అని జూలై 11న వాటికన్ న్యూస్ నివేదించింది.
"ఫ్యాబ్రికా డి శాన్ పియట్రో" స్థాపించిన తర్వాత 500 ఏళ్లలో మహిళలను శాన్‌పీట్రినిగా నియమించుకోవడం ఇదే తొలిసారి అని వాటికన్ న్యూస్ తెలిపింది. అయితే 1506లో మొదటి శంకుస్థాపన చేసిన ప్రస్తుత బాసిలికా భవన పనులలో లేదా అలంకరణలో మహిళలు ఏదో ఒక విధంగా సహాయ పడుతున్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer