పర్యావరణ మరియు సామాజిక న్యాయం కోసం వంతెనలను నిర్మించండి - పోప్ లియో XIV

పర్యావరణ మరియు సామాజిక న్యాయం కోసం వంతెనలను నిర్మించండి - పోప్ లియో XIV

లౌడాటో సి' 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, జగద్గురువులు పోప్ లియో XIV, "మన ఉమ్మడి గృహ" సంరక్షణ కోసం విశ్వవిద్యాలయాల నెట్‌వర్క్‌కు ఒక వీడియో సందేశాన్ని పంపారు.

 రియో ​​డి జనీరోలోని పోంటిఫికల్ కాథలిక్ విశ్వవిద్యాలయంలో సమావేశమైన "మన ఉమ్మడి గృహ" సంరక్షణ కోసం విశ్వవిద్యాలయాల సమూహానికి  ఈ వీడియో సందేశాన్ని పోప్ లియో XIV  గారు పంపారు."COP30 కోసం సన్నాహకంగా వివేచనతో కూడిన సినోడల్ పనిలో పాల్గొనడానికి అయన స్వాగతించారు. మన ఉమ్మడి గృహం  కొరకు వారు చేస్తున్న పని పట్ల  మరియు వారి నిబద్ధత పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ప్రపంచ శాంతి దినోత్సవం కోసం విడుదల చేసిన ఈ సందేశంలో  - "ప్రజా రుణం మరియు పర్యావరణ రుణాల మధ్య సాధ్యమైన సయోధ్య" అనే నేపథ్యం గురించి ప్రతిబింబించడానికి విశ్వవిద్యాలయాల ప్రయత్నాలను ఆయన గుర్తించారు.

"ఈ జూబ్లీ సంవత్సరం ఆశతో కూడిన సంవత్సరం" అని, యువత తమ ప్రయత్నాలను ఆశతో కొనసాగించాలని అని పోప్ లియో XIV  అన్నారు.

విశ్వవిద్యాలయ రెక్టర్లను ఉద్దేశించి పోప్ లియో XIV గారు మాట్లాడుతూ , "విశ్వవిద్యాలయ రెక్టర్లారా, మీరు స్వీకరించిన లక్ష్యంలో నేను మీకు ప్రోత్సాహాన్ని అందించాలనుకుంటున్నాను. అమెరికాలు మరియు ఐబీరియన్ ద్వీపకల్పం మధ్య సమైక్యత వంతెనలను నిర్మించేవారుగా ఉండటం మరియు పర్యావరణ, సామాజిక  న్యాయం కోసం పని చేయాలనీ కోరారు.

చివరిగా, పోప్ లియో XIV  గారు సమావేశానికి  హాజరైన వారందరికీ, వారు చేస్తున్నసేవకు తన కృతజ్ఞతలు తెలిపారు. చివరగా అతను ప్రతి ఒక్కరినీ  "పర్యావరణ మరియు సామాజిక న్యాయం కోసం వారధులను నిర్మిస్తూనే" కొనసాగమని ప్రోత్సహించారు.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు రాసిన  'లౌడాటో సి' అనేది వాతావరణ మార్పు మరియు పర్యావరణం గురించి ఒక పాపల్ లేఖ . 2015లో, పోప్ ఫ్రాన్సిస్ గారు  ఈ లేఖను విడుదల చేశారు. వాతావరణ మార్పును ఒక ప్రపంచ సమస్యగా భావించారు మరియు ఇది పేదలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని లేఖ లో పేర్కొన్నారు.

 

Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer