"ఆయుధాల శబ్దం నిశ్శబ్దం కావాలి" - "సౌభ్రాతృత్వం యొక్క స్వరం వినిపించాలి" : లియో పాపు గారు

"ఆయుధాల శబ్దం నిశ్శబ్దం కావాలి" - "సౌభ్రాతృత్వం యొక్క స్వరం వినిపించాలి" : లియో పాపు గారు

పరిశుద్ధ లియో XIV  పాపు గారు ఉక్రేనియన్ ప్రజలకు తన సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించారు. ఉక్రెయిన్ లో నగరాలపై రష్యా తన దాడులను తీవ్రతరం చేస్తుండటంతో,ఉక్రేనియన్ లో తక్షణ కాల్పుల విరమణ కోసం పరిశుద్ధ లియో XIV  పాపు గారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భముగా మిన్నెసోటాలో కతోలీక పాఠశాల కాల్పుల బాధితుల కోసం మరియు మౌరిటానియా తీరంలో మరణించిన వలసదారుల కోసం ప్రార్థించారు. 

ఆదివారం ఏంజెలస్‌ వద్ద ప్రార్థనలలో పరిశుద్ధ లియో XIV  పాపు గారు మాట్లాడుతూ, యుద్ధం వాళ్ళ జరుగుతున్న  విధ్వంసం మరియు మరణాల గురించి విచారం వ్యక్తం చేశారు.""ఆయుధాల శబ్దం నిశ్శబ్దం కావాలి" అని , మరియు సమాజంలోని అన్ని వర్గాల మధ్య ప్రేమ, గౌరవం, సోదరభావం ఉండేలా, సౌభ్రాతృత్వం యొక్క స్వరం గెలవాలి" అని అన్నారు.

ప్రతి ఒక్కరూ ఉదాసీనతకు లొంగిపోకుండా ఉండాలని, దానికి బదులుగా ప్రార్థన మరియు దాతృత్వ చర్యల ద్వారా అవసరంలో వున్నవారికి దగ్గరవ్వాలని పరిశుద్ధ లియో XIV  పాపు గారు కోరారు. కాల్పుల విరమణ కోసం తన పిలుపును పునరుద్ఘాటించారు.

"అధికారంలో ఉన్నవారు ఆయుధాలను  విడిచిపెట్టి, అంతర్జాతీయ సమాజం మద్దతుతో చర్చలు  మరియు శాంతి మార్గాన్ని చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది" అని పరిశుద్ధ లియో XIV  పాపు గారు అన్నారు.

మిన్నియాపాలిస్ పాఠశాల కాల్పుల బాధితుల కోసం ప్రార్థనలు

"ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ చంపబడుతున్న మరియు గాయపడుతున్న చిన్న  పిల్లలను మేము మా ప్రార్థనలలో చేర్చుకుంటాము" అని పరిశుద్ధ లియో XIV  పాపు గారు  అన్నారు. "మన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఈ యుద్దాలని  ఆపమని దేవుడిని వేడుకుందాం అని అన్నారు.  

మౌరిటానియా తీరంలో వలసదారుల మరణం

మౌరిటానియా తీరంలో వలసదారులతో వెళ్తున్న ఓడ బోల్తా పడటంతో కనీసం 69 మంది మరణించారని, దాదాపు 100 మంది ఇంకా కనిపించడం లేదని ఈ సందర్భముగా పరిశుద్ధ లియో XIV  పాపు గారు గుర్తు చేసుకున్నారు.ఈ దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరి కోసం పరిశుద్ధ లియో XIV  పాపు గారు ప్రార్థించారు. 

Article and Design: M. Kranthi Swaroop