వేళాంగణి మాత దేవాలయంలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

వేళాంగణి మాత దేవాలయంలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే 

విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి  మాత దేవాలయం, కైలాసపురంలో  గుడ్ ఫ్రైడే (పరిశుద్ద శుక్రవారం) సాంగ్యాలు భక్తియుతంగా జరిగాయి.  విచారణ కర్తలు ఫాదర్ సంతోష్ CMF  గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

విచారణ యువత ప్రదర్శించిన యేసు శ్రమల పాట్లు మరియు సిలువ మరణం అందరిని ఆకట్టుకుంది . యువత తో పాటు ఫాదర్ సంతోష్ CMF గారు సిలువను మోస్తూ కైలాసపుర విధులలో ప్రదక్షణ చేసారు. ఫాదర్ సంతోష్ CMF గారిని అనుసరిస్తూ విచారణ ప్రజలు , గురువులు, సిస్టర్స్ , యువతీ యువకులు  ప్రభు యేసుని సిలువ పాట్లను గుర్తు చేసుకున్నారు.     

అనంతరం దేవాలయంలో సిలువమార్గం మరియు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.  యేసు సిలువపై వేలాడదీసిన గంటలను గుర్తుచేసుకుంటూ  మధ్యాహ్నం  3:00 గంటల సమయంలో  ప్రత్యేక  ప్రార్థనలు నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రభు యేసు సిలువపై వేలాడే దృశం మరియు సిలువ ముద్దు కార్యక్రమాన్ని ఫాదర్ సంతోష్ CMF  మరియు ఫాదర్ జాన్ CMF  గార్లు నిర్వహించారు . 

విశ్వాసులు అధిక సంఖ్యలో ఈ దివ్యబలి పూజ లో పాల్గొన్నారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.  

Article and Design By M. Kranthi Swaroop 
RVA Telugu Online Content Producer