విషమంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆరోగ్యం

విషమంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆరోగ్యం

 పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తీవ్రమైన శ్వాసకోస సమస్యతో రోమ్‌లోని జెమెల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు రక్తమార్పిడి చేసి, హై ఫ్లో ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ఫిబ్రవరి 14 న న్యుమోనియాతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గత 9 రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు.

ఇటీవల  పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఛాతీని స్కాన్‌ చేయగా ఆయన రెండు ఊపిరితిత్తులలో న్యుమోనియా కనిపించిందని, దీనికి అదనపు చికిత్స (డ్రగ్ థెరపీ) అవసరమని తేలింది.

ఆదివారం సాయంత్రం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి గురించి హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ప్రకటనలో "పవిత్ర తండ్రి పరిస్థితి విషమంగా ఉంది అని , కానీ నిన్న సాయంత్రం నుండి, ఆయనకు శ్వాసకోశ సమస్యలు రాలేదు అని తెలిపింది.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి రెండు యూనిట్ల సాంద్రీకృత ఎర్ర రక్త కణాలు ఇవ్వబడ్డాయి అని , మరియు అతని హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగాయి అని, నాసికా కాన్యులాస్ ద్వారా అధిక ప్రవాహ ఆక్సిజన్ చికిత్స కొనసాగుతుంది అని తెలిపింది.

ఆదివారం ఉదయం ఆసుపత్రిలో తనను జాగ్రత్తగా చూసుకుంటున్న వారితో కలిసి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పవిత్ర ప్రార్థనలో పాల్గొన్నారు అని తెలియజేసారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer