విశ్వాసుల వద్దకు కర్నూలు పీఠకాపరి
నవంబర్ 5,2024 న కర్నూలు మేత్రాసనం,ఉప్పలదడియా విచారణలో ఉదయము 10:00 నుంచి దాదాపు రాత్రి 9:30 గంటల వరకు విచారణ స్థాయిలో ఉన్నటువంటి 8ది గ్రామాలను అనగా, కేతవరము, దిగువపాడు, ఉప్పలదడియా, కలమందలపాడు, మాసాపేట, దేవనూరు బన్నూరు, కడుమూరు, గ్రామాలను సందర్శించారు.
క్రైస్తవ సంఘాలలో ఉన్న, సమస్యలు తెలుసుకోవడం వారిని ప్రేమగా పలకరించడం, వారి చెప్పే సమస్యలు వినడం, ముఖ్యంగా దేవుని సందేశాన్ని, బైబిల్లోని కొన్ని మర్మాలను, వివరించడం, ఆసక్తికరంగా, తండ్రి గారి ప్రసంగాలు మాటలు, ప్రజలు వినడం జరిగింది.
ఎక్కడ కూడా అలసిపోకుండా, ప్రజలందరూ కూడా, ప్రేమతో ఆప్యాయంగా తండ్రి గారిని బ్యాండు మేలాలతో ఊరేగింపులు ప్రజలందరూ తండోపతండాలుగా పాల్గొని, హృదయపూర్వకంగా బిషప్ గారిని ఆహ్వానించి,పూలమాలలతో సన్మానించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ పెద్దలు, యవ్వనస్తులు, స్త్రీలు పురుషులు, మరియదళం సభ్యులు,ఉపదేషులు ప్రజలందరూ అశేషంగా పాల్గొని తండ్రి గారిని చూసి వారి ఆశీర్వాదం పొందుకోవాలని ఆశతో తండ్రి గారి దగ్గరికి రావడం జరిగింది
ఈ కార్యక్రమం అంతా, విచారణ గురువు గురుశ్రీ మధుబాబు గారు, డీకన్ బ్రదర్ తోమాసు గారు, విచారణ ప్యారిస్ కౌన్సిలర్ సభ్యులు, మరియు యువత, సంఘ పెద్దలు, తండ్రి గారితో పాటు, 8 గ్రామాలు తిరిగి ఉత్సాహంతో పాల్గొన్నారు,
ఈ కార్యక్రమంలో, ప్రజలను క్రమశిక్షణతో నడపడానికి, ఆనిమేటర్ చిన్నప్ప గారు కూడా తోడ్పడ్డారు, ఈ కార్యక్రమం అంతా దేవునికి మహిమ కరంగానూ విచారణ ప్రజలందరికీ దీవెనకరంగాను మారింది