విశాఖ అతిమేత్రాసనంలో జాతీయ నిరసన దినము
విశాఖ అతిమేత్రాసనంలో జాతీయ నిరసన దినము
విశాఖ అతిమేత్రాసనంలో ఆగస్టు 10, శనివారం ఉదయం 10.30 గంటలకు గాంధీ విగ్రహం, జీవీఎంసీ వద్ద దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కొరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ డి బాలశౌరి గారు, విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ శ్రీ జొన్నాడ జాన్ ప్రకాశ్ గారు, గురుశ్రీ ప్రతాప్ సరిస గారు , ఇతర గురువులు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కథోలికులు,AICU సభ్యులు, ఉపదేశలు, సంఘ పెద్దలు,SC/BC కమిషన్ వారు తదితరులు పాల్గొన్నారు.
దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ శ్రీ జొన్నాడ జాన్ ప్రకాశ్ గారు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు కలెక్టర్ ఆఫీస్ లో DRO కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమములో AICU అధ్యక్షులు శ్రీ బి.వి.రవీంద్ర శేషుబాబు గారు , కార్యదర్శి బి.కె.జోసఫ్ గారు, జాతీయ కార్యదర్శి శ్రీ జి.స్వామినాధం గారు మరియు SC/BC కమిషన్ వారు పాల్గొన్నారు.
మత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఎవరు ఇష్టపడిన మతాలను వారు అనుసరించే విధంగా చొరవ తీసుకోవాలని శ్రీ జొన్నాడ జాన్ ప్రకాశ్ గారు పేర్కొన్నారు.
PMI సీనియర్ సభ్యులు నిర్మల మేరీ గారు మాట్లాడుతూ "మతం మారినంత మాత్రాన దళితుల ఆర్థిక స్థితిలో మార్పు రాలేదని, ఇప్పటికి దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer