రేడియో వెరితాస్ ఆసియా - కొత్త అధ్యాయం ప్రారంభం

రేడియో వెరితాస్ ఆసియా -  కొత్త అధ్యాయం ప్రారంభం

సెప్టెంబర్ 1, 2025న, ఫిలిప్పీన్స్‌లోని క్యూజోన్ నగరం(Quezon City) లోని రేడియో వెరితాస్ ఆసియా కాంపౌండ్‌లో జరిగిన  గౌరవప్రదమైన కార్యక్రమంలో ఫాదర్ ఫెల్మార్ కాస్ట్రోడెస్ ఫీల్, SVD గారు అధికారికంగా "రేడియో వెరితాస్ ఆసియా"  కొత్త జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నోవాలిచెస్(Diocese of Novaliches) పీఠాధిపతులు మరియు PREIC బోర్డు కోశాధికారి మహా పూజ్య "రాబర్టో గా" గారు పాల్గొని కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అలాగే  FABC-OSC ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఫాదర్ జాన్ మి షెన్ (John Mi Shen) గారు మరియు RVA సిబ్బంది, వివిధ  "రేడియో వెరితాస్ ఆసియా" భాషా సేవల సమన్వయకర్తలు ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫాదర్ జాన్ మి షెన్ గారి నేతృత్వంలో ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో గత తొమ్మిది సంవత్సరాలుగా అంకితభావంతో సేవ చేసిన మాజీ జనరల్ మేనేజర్‌ "ఫాదర్ విక్టర్ సదయ"(Victor Sadaya), CMF గారిని పలువురు గౌరవించారు.ఈ సందర్భముగా  "ఫాదర్ విక్టర్ సదయ"CMF గారు  "రేడియో వెరితాస్ ఆసియా"ను దాని చారిత్రాత్మక డిజిటల్ పరివర్తన ద్వారా మార్గనిర్దేశం చేశారు.

తన హృదయపూర్వక వీడ్కోలు సందేశంలో, ఫాదర్ విక్టర్ సదయ"CMF గారు తన తొమ్మిది సంవత్సరాల సేవలో "రేడియో వెరితాస్ ఆసియా" కుటుంబం అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అయన కాలంలో షార్ట్‌వేవ్ రేడియో ప్రసారం నుండి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు "రేడియో వెరితాస్ ఆసియా"(RVA) చారిత్రాత్మక పరివర్తన చెందింది. ఈ సాహసోపేతమైన మార్పులో ఆన్‌లైన్ శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా "రేడియో వెరితాస్ ఆసియా" సామర్థ్యాన్ని పెంపొందించారు. 

 RVA యొక్క 50వ వార్షికోత్సవ వేడుకలు, అలాగే  RVA అనుబంధ సంస్థ అయిన యూనిటాస్ ఆసియా కార్పొరేషన్ స్థాపన మరియు ఆడిటోరియం మరియు సోషల్ హాల్ పునరుద్ధరణతో పాటు RVA మ్యూజియం నిర్మాణం వంటి మైలురాళ్లను "ఫాదర్ విక్టర్ సదయ"CMF గారి హయాంలోనే జరిగాయి.

ఫాదర్ ఫెల్మార్ కాస్ట్రోడెస్ ఫీల్ గారిని అందరు హృదయపూర్వకంగా స్వాగతించారు. ఫాదర్ విక్టర్ సదయ CMF, గారు నూతన జనరల్ మేనేజర్ ఫాదర్ ఫెల్మార్ కాస్ట్రోడెస్ ఫీల్ కు ఒక పెద్ద బంగారు పూత పూసిన కార్డ్‌బోర్డ్ కీని అందజేశారు మరియు తన నాయకత్వానికి మద్దతు ప్రకటించారు.

"ఇది దేవుని ప్రణాళికలో భాగం" అని ఫాదర్ ఫెల్మార్ కాస్ట్రోడెస్ ఫీల్, SVD గారు అన్నారు. దేవుని రాజ్యాన్ని నిర్మించడంలో ప్రతి సహాయం విలువైనదే అని నొక్కి చెప్పారు.

Article and design by M kranthi swaroop