రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సంభాషించిన XIV లియో పోప్

జూన్ 4 బుధవారం మధ్యాహ్నం, XIV లియో పోప్ మరియు రష్యా అధ్యక్షుడు Vladimir Putin వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు, ముఖ్యంగా ఉక్రెయిన్‌లో యుద్ధంపై దృష్టి సారించారు.

వారిరువురు మానవతా పరిస్థితిని, అలాగే అవసరమైన చోట సహాయాన్ని అందించాల్సిన అవసరాన్ని చర్చించారని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ Matteo Bruni విలేకరులకు తెలిపారు .

"ఇరు దేశాల మధ్య సానుకూల సంబంధాలను నెలకొల్పడానికి మరియు సంఘర్షణకు పరిష్కారాలను వెతకడానికి సంభాషణ ముఖ్యమని తెలిపారు, శాంతికి అనుకూలంగా ఉండే సంజ్ఞను తీసుకోవాలని రష్యాకు పోప్ విజ్ఞప్తి చేశారు" అని ప్రకటన పేర్కొంది.

పోప్ లియో XIV మరియు అధ్యక్షుడు పుతిన్ ఖైదీల మార్పిడి కోసం జరుగుతున్న ప్రయత్నాలను మరియు 

బోలోగ్నా అగ్రపీఠాధిపతులు  Cardinal Matteo Maria Zuppi ఖైదీల మార్పిడి కోసం జరుగుతున్న ప్రయత్నాలను, పొప్ మరియు అధ్యక్షులు చర్చించారు.