యుద్ధ బాధితుల కొరకు ప్రార్దించిన పోప్ లియో

కాస్టెల్ గాండోల్ఫోలో జరిగిన త్రికాల ప్రార్ధన ముగింపులో, పోప్ లియో యుద్ధం కారణంగా బాధపడుతున్న మరియు అవసరంలో ఉన్న వారందరి కోసం ప్రార్థించమని ప్రతి ఒక్కరినీ కోరారు.

జులై 12 న Barcelona 1909లో విశ్వాసం పట్ల ద్వేషంతో హత్య చేయబడిన బ్రదర్ Licarion May ధన్యుడిగా ప్రకటించబడ్డారు. 

ఈయన ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మారిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ది స్కూల్స్‌’కు చెందిన మఠవాసి. ప్రతికూల పరిస్థితులలోనూ, ఆయన తన విద్యా, బోధనాపరమైన బాధ్యతను అంకితభావంతో, ధైర్యంగా నిర్వర్తించారు. 

ఈ హతసాక్షి వీరోచిత సాక్ష్యం మనందరికీ, ముఖ్యంగా యువత విద్య కోసం పనిచేసే వారికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను.

పోలాండ్ నుండి వచ్చిన లిటర్జికల్ అకాడమీ వేసవి కోర్సులో పాల్గొంటున్న వారందరికీ, అలాగే ఈ రోజు చెస్టోచోవా పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్రలో పాల్గొంటున్న పోలిష్ యాత్రికులకు నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

నేటితో బెర్గామో మేత్రాసన జూబిలీ తీర్థయాత్ర ముగుస్తుంది. తమ బిషప్‌తో కలిసి పవిత్ర ద్వారం గుండా వెళ్ళడానికి రోముకు వచ్చిన యాత్రికులకు నేను అభినందిస్తున్నాను