మొదలైన పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ వేడుకలు

మొదలైన పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ వేడుకలు


విశాఖ అతిమేత్రాసనం,  మధురవాడ విచారణలో గల  పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. విచారణ గురువులు గురుశ్రీ  ప్రకాష్ గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు మొదలైనవి.

నవదిన ప్రార్థనలలో భాగంగా తేది 24-9-2024 నుండి 2-10-2024 వరకు సా॥ గం|| 6:00  నుండి  జపమాల, వాక్యార్చన, దివ్యపూజ, ప్రార్థనలు జరగనున్నాయి. పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి పండుగ మహోత్సవము తేది 4-10-2023 బుధవారం నాడు జరగనున్నది.

గురుశ్రీ వై మరియారత్నం గారు  అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు.  
"సమస్తమును విడిచిపెట్టి క్రీస్తును అనుసరించు" అన్న సువార్త వాక్కు పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి జీవితంలో అక్షర సత్యమైనది అని  గురుశ్రీ  ప్రకాష్ గారు తెలిపారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.

ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో విశ్వాసులు , గురువులు, మఠకన్యలు, సలహా సంఘ పెద్దలు, యువతీ యువకులు పాల్గొన్నారు. విచారణ గురువులు గురుశ్రీ  ప్రకాష్ గారు  'పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి పండుగ మహోత్సవమునకు ప్రజలను , విశ్వాసులను  ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer