భక్తిశ్రద్ధలతో పాప పశ్చాత్తాప పాదయాత్ర

భక్తిశ్రద్ధలతో పాప పశ్చాత్తాప పాదయాత్ర
విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంతవలస గిరిజన విచారణ, క్రీస్తురాజు పుణ్యక్షేత్రం లో పాప పశ్చాత్తాప పాదయాత్ర భక్తిశ్రద్ధలతో జరిగింది. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, యర్రసామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి. జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మార్చి 26, 2025 బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పాదయాత్ర మార్కొండపుట్టి గ్రామము నుండి మరియు D.K.పట్నం నుండి ఒకేసారి మొదలైయి క్రీస్తురాజు పుణ్యక్షేత్రం వరకు సాగింది. విచారణ సహాయక గురువులు గురుశ్రీ జయరాజు గారి ఆధ్వర్యంలో జరిగింది. అధికసంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు.
బొబ్బిలి విచారణ కర్తలు గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక సిలువ మార్గం (కొండా పైకి) నిర్వహించారు.
ఉదయం 11 గంటలకు శ్రీకాకుళ మేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దూసి దేవరాజు గారు ఇతర గురుపుంగవులతో కలసి సమిష్టి దివ్య పూజాబలిని సమర్పించారు.
గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారు మాట్లాడుతూ "ఈ 40 రోజుల తపస్సుకాలంలో మన పాపములకై పశ్చాత్తాప పడి, క్రీస్తు ప్రభువుని శ్రమలను ధ్యానిస్తూ ప్రభు యేసుని మార్గంలో పయనించాలని అన్నారు.
గురుశ్రీ పి. జీవన్ బాబుగారు వచ్చిన భక్తులందరికీ ప్రేమ విందుని ఏర్పాటు చేసారు.పాప పశ్చాత్తాప పాదయాత్ర మహోత్సవానికి సహకరించిన విచారణ పెద్దలు, మరియదళం సభ్యులు, యువతీ యువకులుకు మరియు సహాయం అందించిన ప్రతి ఒక్కరికి గురుశ్రీ పి. జీవన్ బాబుగారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Design and Article By
M Kranthi Swaroop
RVA Telugu Online producer