"మన నిరీక్షణ యాత్ర" పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్డినల్ మహా పూజ్య పూల అంతోని

కార్డినల్ మహా పూజ్య  పూల అంతోని

"మన నిరీక్షణ యాత్ర" పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్డినల్ మహా పూజ్య  పూల అంతోని

2025 జూబ్లీ అర్థవంతమైన వేడుకల కోసం రెండవ వాటికన్ ప్రధాన పత్రాలను తిరిగి అధ్యయనం చేయడానికి మరియు ఆధ్యాత్మిక జీవితం మరియు బోధనలకు మనల్ని మనం పునరుద్ధరించుకోవడానికి మరియు తిరిగి కట్టుబడి ఉండటానికి శ్రీసభ  నుండి అందిన ఆదేశాల ప్రకారం, క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక సంస్థ, టీసీబీసీ అధ్యక్షులు మహా పూజ్య కార్డినల్ పూల అంతోని గారి అధ్యక్షతన మరియు ప్రధాన కార్యదర్శి మహా పూజ్య రాజారావు గారి మార్గదర్శకత్వంలో, రెండవ వాటికన్ పాత్రల యొక్క"పరమ పవిత్ర మహా సభ, లోకానికి వెలుగు శ్రీసభ - శ్రీసభ పై సంభావిత పత్రము, దైవవాక్కు - దేవుని బయల్పాటుపై సంభావిత పత్రము మరియు ఆధునిక ప్రపంచంలో శ్రీసభ - ఆధునిక ప్రపంచంలో శ్రీసభ పాత్రపై సంభావిత పత్రము" అను నాలుగు ప్రధాన పత్రాలతో కూడిన పుస్తకాన్ని తెలుగులోక "మన నిరీక్షణ యాత్ర" పేరుతో సంక్షిప్త రూపంలో తీసుకువచ్చింది. , .

19 సెప్టెంబర్ 2024 న, మహా పూజ్య కార్డినల్ పూల అంతోని గారు విడుదల చేశారు. గురుశ్రీ రాజు అలెక్స్, జీవన్ ప్రెస్ డైరెక్టర్ గురుశ్రీ జయరాజు, పుస్తక రచయితలలో ఒకరైన గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు, అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు భారతమిత్రం ఎడిటర్ గురుశ్రీ చల్లా డేవిడ్ గారు మరియు బైబిల్ కమిషన్ సెక్రటరీ గురుశ్రీ కిరణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. త్వరలో ఈ పుస్తక ప్రతులను అన్ని మేత్రాసనాలకు పంపనున్నారు. సికింద్రాబాద్‌లోని జీవన్ ప్రెస్‌లో కూడా ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.