మధ్యప్రాచ్యంలో యుద్ధం "ఆమోదయోగ్యం కాదు" - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

మధ్యప్రాచ్యంలో యుద్ధం  "ఆమోదయోగ్యం కాదు" - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు సీనియర్ హిజ్బుల్లా కమాండర్లు మరణించారు.   మధ్యప్రాచ్యంలో సంఘర్షణ తీవ్రతరం కావడం "ఆమోదయోగ్యం కాదు" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పేర్కొన్నారు.

ఇటీవలి రోజుల్లో తీవ్రమైన బాంబు దాడులు అనేక మంది బాధితులను బలిగొన్నాయి మరియు  లెబనాన్ నుండి వచ్చిన వార్తలకు నేను చింతిస్తున్నాను అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన సాధారణ ప్రేక్షకులతో  అన్నారు.

లెబనాన్‌లో ఉన్న ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడుల ప్రచారాన్ని సెప్టెంబర్ 21న ప్రారంభించినప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో పోరాటం తీవ్రమైంది. సెప్టెంబరు 25 నాటికి, లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, బాంబు దాడుల్లో 50 మంది పిల్లలతో సహా 550 మందికి పైగా మరణించారు.సెప్టెంబర్ 27న, మూడు దశాబ్దాలకు పైగా హిజ్బుల్లాకు నాయకత్వం వహించిన హసన్ నస్రల్లా, బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులలో మరణించాడు.

"ఇటీవలి కాలంలో ఇప్పటికే చాలా బాధలను అనుభవించిన లెబనీస్ ప్రజలకు నేను నా సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నాను" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు. "మరియు ప్రతిఒక్కరి కోసం, యుద్ధం ఫలితంగా బాధపడుతున్న ప్రజలందరి కోసం ప్రార్థిద్దాం అని , యుద్ధం వల్ల బాధపడుతున్న  ఉక్రెయిన్, మయన్మార్, పాలస్తీనా, ఇజ్రాయెల్, సూడాన్,  ప్రజలందరి కొరకు ప్రార్ధించాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కోరారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer