భక్తి శ్రద్ధలతో 14 దేవాలయాలలో సిలువమార్గం

భక్తి శ్రద్ధలతో 14  దేవాలయాలలో సిలువమార్గం  

 హైదరాబాద్ అతిమేత్రాసనం లో  "ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీస్" వారి ఆద్వర్యం లో 14  దేవాలయాలలో సిలువమార్గం మార్చి 25 న భక్తి శ్రద్ధలతో జరిగింది. బ్రదర్ అంతోనీ పాట్రిక్ గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు.  

వివిధ విచారణాల నుండి సుమారు 200 మంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.  ఉదయం 7 గంటలకు అమృతవాణి నుండి ఈ కార్యక్రమం మొదలైనది. 3 బస్సులలో, కార్లలో భక్తులు పాల్గొన్నారు.ప్రతి ఒక్కరు సిలువను పట్టుకొని ప్రతి దేవాలయాన్ని సందర్శించారు.  ప్రతి విచారణలో సిలువమార్గం (ఒక్కొక స్థలం) భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.  

వివిధ విచారణ కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న  విశ్వాసుల కొరకు ప్రత్యేకించి ప్రార్ధించారు. రాత్రి 11:00 గంటలకు అమృతవాణి డైరెక్టర్  గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు చివరి దివ్యపూజాబలిని సమర్పించి , విశ్వాసుల కొరకు ప్రార్ధించారు.

బ్రదర్ అంతోనీ పాట్రిక్  గారు  విశ్వాసులకు  ప్రేమ విందును  ఏర్పాటు చేసారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Design and Article By
M Kranthi Swaroop
RVA Telugu Online producer