ఘనంగా మొదలైన క్రీస్తు జయంతి జూబ్లీ - 2025 వేడుకలు

ఘనంగా మొదలైన క్రీస్తు జయంతి జూబ్లీ - 2025 వేడుకలు
రామంతాపూర్ లోని పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయం నందు క్రీస్తు జయంతి జూబ్లీ - 2025 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ అగ్రపీఠం పరిధిలో ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, నల్లగొండ, కర్నూలు, కడప, ఆదిలాబాద్, శంషాబాద్ పీఠాలకు 21, 22 అక్టోబరు 2025 తేదీలలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
పీఠాధిపతులందరు పాల్గొనగా మహా ఘన కార్డినల్ పూల అంతోని గారు జూబిలీ పతాకాన్ని ఆవిష్కరించారు. మహా ఘన కార్డినల్ పూల అంతోని గారు క్రీస్తు జయంతి జూబ్లీ వేడుక ప్రసంగాన్ని విశ్వాసులకు అందించారు. అనంతరం దివ్యబలి పూజను సమర్పించారు. పీఠాధిపతులు , గురువులు, కన్యస్త్రీలు మరియు అధిక సంఖ్యలో విశ్వాసులు ఈ దివ్యబలి పూజలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఈ క్రీస్తు జయంతి జూబ్లీ - 2025 వేడుకలు జరగనున్నవి.
article by M Kranthi swaroop