భక్తి యుతంగా జీవస్వరం 2024ఆధ్యాత్మిక స్వస్థత కూటములు

భక్తి యుతంగా జీవస్వరం 2024ఆధ్యాత్మిక స్వస్థత కూటములు

ఆదిలాబాద్ మేత్రాసనం సువార్త విభాగం, బెల్లంపల్లి AMC  గ్రౌండ్ లో జనవరి 19, 20, 21 శుక్ర, శని, ఆదివారాలలో మూడు రోజుల పాటు జీవస్వరం 2024 ఆధ్యాత్మిక స్వస్థత కూటములను  నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు, విశ్వాసులు హాజరయ్యారు. మూడు రోజులు  ప్రభు యేసుని నామాన్ని ఘనపరిచేలా భక్తియుతంగా ప్రార్థనలు జరిగాయి.

ఆదిలాబాద్ మేత్రాణులు మహా పూజ్య ప్రిన్స్ ఆంథోని గారు ముఖ్య వాక్యోపదేశకులుగా ఈ మూడురోజుల ఆధ్యాత్మిక స్వస్థత కూటములలో పాల్గొని  ప్రజలకు దైవ సందేశాన్ని అందించారు. ఈ మూడురోజులు మహా పూజ్య ప్రిన్స్ ఆంథోని గారు ప్రత్యేక ప్రార్థనలతో, స్తుతులతో ,పాటలతో ప్రజలను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించారు. ఇతర గురువులతో కలసి దివ్యపూజాబాలిని సమర్పించారు.

ఆదిలాబాద్ మేత్రాసనం సువార్త విభాగం వారు ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటూ, తమ ప్రార్థన సహాయాన్ని ప్రజలకు అందించారు.ఈ కార్యక్రమాలను ప్రతి రోజు సాయంత్రం 5:00 నుడి 10:00 గంటల వరకు ప్రత్యక్షంగా   జీవస్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేసారు.

 

Article and Design By
M.kranthi Swaroop
RVA Telugu Online Producer