ఫాతిమా మాత 71వ మేత్రాసన వార్షిక మహోత్సవం

వరంగల్ మేత్రాసనం,ఫాతిమానగర్, ఫాతిమా కథడ్రల్ నందు మార్చి 13,2024 న ఫాతిమా మాత 71వ మేత్రాసన వార్షిక మహోత్సవం ఘనంగా జరిగింది .

హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా శ్రేష్ఠులు కార్డినల్ పూల అంథోని, వరంగల్ పీఠకాపరి మహా పూజ్య ఉడుమల బాల మరియు మేత్రాసన గురువులచే సమిష్టి కృతజ్ఞతా బలిపూజ సమర్పించారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మరియు స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డా.తాటికొండ రాజయ్య కుడా ఈ పండుగ పూజలో పాల్గొన్నారు.

పునీత సిసిలియా పీఠమండలి గాయకబృందం గురుశ్రీ సురేంద్ర గారి నేతృత్వంలో పవిత్ర గీతాలను మధురంగా ఆలపించారు.

ఈ పండుగలో అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు

Tags