ప్రజలఅందరూ కలసి ప్రార్ధించాలని కారిటాస్ జపాన్ విజ్ఞప్తి చేసింది

 ప్రజలఅందరూ కలసి ప్రార్ధించాలని  కారిటాస్ జపాన్ విజ్ఞప్తి చేసింది

జపాన్‌లో 2024 జనవరి 1న  శక్తిమంతమైన భూకంపం సంభవించింది. జపాన్ కారిటాస్ అధ్యక్షుడు,  భూకంపం తర్వాత జపనీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సర్వం కోల్పోయాయి  బాధపడుతున్న వారి కొరకు ప్రార్థనల  కోసం విజ్ఞప్తి చేశారు.

నివేదికలను ప్రకారం నిగట  బిషప్ దైసుకే  నరుయ్ , SVD, 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది అని , 200 మందికి పైగా మరణించారు, 500 మందికి పైగా గాయపడ్డారు అని అన్నారు. అతి తక్కువ ఉష్ణోగ్రతలు మరియు భారీ మంచు మరియు వర్షం కారణం గా సహాయానికి  ఆటంకం కలిగించాయి అని అన్నారు.వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నీరు మరియు విద్యుత్ కొరతతో ఉన్నారు అని తెలిపారు.  

భారీ పగుళ్లు తో రోడ్లు తెగిపోయాయి,  గ్రామాలు మరియు పట్టణాల్లో అనేక మంది ప్రజలు ఒంటరిగా ఉన్నారు. వారి కొరకు  ప్రార్థన చేస్తూ,  ఇతర మార్గాల ద్వారా తోడుగా ఉండాలని  మానసిక మరియు ఆధ్యాత్మిక బలం చాలా ముఖ్యం అని బిషప్ నరుయ్ అన్నారు.

జపాన్‌లో విధ్వంసకర భూకంపం తరువాత అయిదు రోజులకు శిథిలాల కింద నుంచి 90 ఏళ్ల వృద్ధురాలు ఒకరు  ప్రాణాలతో బయటపడ్డారు. భూకంపం తర్వాత తొలి 72 గంటలను చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆ తర్వాత నుంచి సమయం గడిచినకొద్దీ ప్రజలు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తగ్గిపోతాయి.

మహా పూజ్య పొప్ ఫ్రాన్సిస్ గారు "భూకంప విపత్తు సంభవించిన వెంటనే మరియు తన బుధవారం జనరల్ ఆడియన్స్‌లో మాట్లాడినప్పుడు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.అతను భూకంప బాధితులు మరియు సహాయం చేస్తున్న వారి కొరకు ప్రత్యేక  ప్రార్థనలు చేశారు మరియు విమానం  ప్రమాదంలో మరణించిన టోక్యో రెస్క్యూ సిబ్బంది కొరకు   కూడా ప్రార్థనలు చేశారు.

జపాన్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ భూకంపం సంభవించిన మరుసటి రోజు భూకంప ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర వస్తువులను తీసుకువెళుతున్న కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఐదుగురు కోస్ట్ గార్డ్ సిబ్బందిలో నలుగురు మరణించారు.

మొత్తం 379 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. విమాన ప్రమాదంనుండి తరలింపు స్లైడ్‌ల ద్వారా సకాలంలో బయటపడి  అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్నారు.కారిటాస్ జపాన్ ప్రపంచవ్యాప్త ఉన్న కారిటాస్ నెట్‌వర్క్‌ తో ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా మానవ అభివృద్ధి ప్రాజెక్టులపై తన సహాయ సహకారాలను అందిస్తుంది.టోక్యోలోని కారిటాస్ జపాన్ జనరల్ సెక్రటేరియట్ 16 మేత్రాసనాలు , సిబ్బంది మరియు వేలాది మంది వాలంటీర్లతో సన్నిహితంగా పనిచేసే ఐదుగురు సిబ్బందిని నియమించింది.