పోప్ ఫ్రాన్సిస్ గారి క్రిస్మస్ దైవార్చన వివరాల జాబితాను విడుదల చేసిన వాటికన్

క్రీస్తు జయంతి సాంగ్యాల సమయంలో సెయింట్ పీటర్స్ బసిలికా మరియు రోమ్‌లోని రెబిబ్బియా చెరసాల పవిత్ర ద్వారం తెరవనున్న పొప్ ఫ్రాన్సిస్

సెయింట్ పీటర్స్ బసిలికాలో క్రిస్మస్ జాగరణ దివ్యబలి పూజ సమయంలో జూబ్లీ 2025 సంవత్సరం ప్రారంభించి వాటికన్ బాసిలికా పవిత్ర ద్వారాన్ని తెరుస్తారు.

క్రీస్తు జయంతి నాడు పొప్ గారు తన సంప్రదాయ URBI et Orbi ప్రసంగంను, మరియు ప్రపంచానికి ఆశీర్వాదాలు అందించనున్నారు.

డిసెంబర్ 26 ,పునీత స్టీఫెన్ గారి పండుగ రోజున రోమ్‌లోని రెబిబ్బియా చెరసాల డాగర దివ్యబలిపూజను సమర్పించి పవిత్ర ద్వారం తెరుస్తారు.

2024 ముగింపులో జాగరణ దివ్యపూజలో సెయింట్ పీటర్స్ బాసిలికాలో పొప్ఫ గారు మొదటి సంద్యోపాసనము చేసి మరియు TE Deum  (దైవ స్తుతిగీతాన్ని) ప్రార్థనలను చేస్తారు .

మరుసటి రోజు, నూతన సంవత్సర దినోత్సవం మరియు 58వ ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యపూజ బలిని సమర్పిస్తారు.

జనవరి 6న, సెయింట్ పీటర్స్ బసిలికాలో ముగ్గురు జ్ఞానుల పండుగ దివ్యపూజాబలికి  అధ్యక్షత వహిస్తారు.

జనవరి 12న సిస్టీన్ దేవాలయంలో దివ్యపూజతో  వాటికన్ ఉద్యోగుల అనేక మంది పిల్లలకు జ్ఞానస్నానం అందచేసి క్రీస్తు జయంతి వేడుకలను ముగ్గించనున్నారు.

సుప్రీం పోంటీఫ్ దైవార్చన  వేడుకల కార్యాలయం ఈ పాపల్ ప్రార్ధనలను డిసెంబర్ మధ్య నుండి జనవరి మధ్య వరకు సోమవారం నవంబర్ 25 న ప్రకటించింది.