పొంటిఫికల్ అకాడమీ ఫర్ లైఫ్ అధ్యక్షునిగా మొన్సిగ్నోర్ రెన్సో పెగరారో

పొంటిఫికల్ అకాడమీ ఫర్ లైఫ్ అధ్యక్షునిగా మొన్సిగ్నోర్ రెన్సో పెగరారో
మే 27,2025 న పొంటిఫికల్ అకాడమీ ఫర్ లైఫ్ (PAV) నూతన అధ్యక్షునిగా మొన్సిగ్నోర్ రెన్సో పెగరారోను XIV లియో పోప్ నియమించారు
వైద్య డిగ్రీ కలిగిన జీవ నీతి శాస్త్రవేత్త అయిన రెన్సో, ఏప్రిల్ 21న 80 ఏళ్లు నిండిన ఆర్చ్ బిషప్ Vincenzo Paglia స్థానంలో నియమితులయ్యారు.
జూన్ 4, 1959న ఉత్తర ఇటలి నగరమైన paduaలో జన్మించిన రెంజో, జూన్ 11, 1989న గురువుగా అభిషేకింపబడి, పాదువా మేత్రాసనానికి నియమితులయ్యారు
1985లో Padua విశ్వవిద్యాలయం నుండి వైద్య మరియు శస్త్రచికిత్సలో డిగ్రీని పొందారు,
1990లో రోమ్‌లోని పోంటిఫికల్ గ్రెగోరియన్ విశ్వవిద్యాలయం నుండి నైతిక వేదాంతశాస్త్రంలో లైసెన్సియేట్ ను
కాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్ నుండి బయోఎథిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా పొందాడు.
2010 నుండి 2013 వరకు, మొన్సిగ్నోర్ రెన్సో European Association of Centers of Medical Ethics అధ్యక్షుడిగా తన సేవను అందించారు
ఈయన సెప్టెంబర్ 2011 నుండి అకాడమీ ఛాన్సలర్‌గా పనిచేస్తున్నారు.