పేద విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణి

కడప మేత్రాసనం, మరియాపురం విచారణ, సెయింట్ మేరీస్ కథెడ్రల్ నందు మే 25, 2024 న ఆరువందల మంది పేద విద్యార్థులకు పుస్తకాల పంపిన జరిగింది.

"ప్రస్తుత కాలంలో పుస్తకాల ధరలు పెరిగి నందున పేద తల్లిదండ్రులకు పుస్తకాలు కొనడమే భారంగా మారిన కొన్ని వాస్తవ సంఘటనలు చుసిన నాకు ఈ మంచి పనిని చేయాలనే తలంపు 
16 సంవత్సరాల క్రితమే వచ్చిందని, దానినే కొనసాగిస్తూ వస్తున్నానని" గురుశ్రీ బిరుసు రాజా గారు తెలిపారు.

తాను ఎక్కడ ఉన్నా ఈ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తెలియచేసారు.

ఈ కార్యకర్మంలో కడప మేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ టి బాలరాజు గారు పాల్గొనడం హర్షించ దగిన విషయంగా గురుశ్రీ రాజా గారు తెలియచేసారు.