పెరువియన్ యాత్రికుల ప్రతినిధి బృందాన్ని కలిసిన పోప్

జూలై 28, సోమవారం PERU జాతీయ సెలవుదినం మరియు 2025 యువతా జూబ్లీ అధికారిక ప్రారంభం సందర్బంగా 105 మంది పెరువియన్ యాత్రికుల ప్రతినిధి బృందాన్ని వాటికన్‌లో పోప్ లియో కలిశారు.

"మా మనసులను ఆలింగనం చేసుకునే చిరునవ్వుతో పోప్ మాకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు" అని చిక్లాయో మేత్రాసన యూత్ మినిస్ట్రీ కోఆర్డినేటర్ Ximena Valdivia Muro వాటికన్ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు.

మీరు ఒంటరి వాళు కాదు,వేర్వేరు దేశాల నుండి వచ్చినప్పటికీ మనమంతా ఒకే కథోలిక శ్రీసభకు చెందిన వాళ్లము అని పోప్ గుర్తు చేశారు అని Muro చెప్పింది.

ఒకప్పుడు తమ పీఠాధిపతిగా ఉన్న వ్యక్తిని మళ్ళీ చూసినప్పుడు నాకు సంతోషంగా ఉంది అని Chiclayoకు చెందిన Gisela Valderas అన్నారు.
 
జూబ్లీ సమయంలో వారు అనుభవించిన ప్రతిదాన్ని గ్రహించి, వారి సమాజాలకు తిరిగి తీసుకురావాలనే పోప్ సందేశాన్ని ఇద్దరు యువతులు మిషనరీ ఆదేశంగా స్వీకరించారు.

“ఇది క్షమాపణ మరియు ఉమ్మడి విశ్వాసం వేడుక,మేము సయోధ్యకు మా హృదయాలను తెరిచి, దివ్యసంస్కారాలను జీవించడానికి మరియు సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాము” అని peru యువత ధృవీకరించారు.