పునీత అద్భుత అంతోనివారి దేవాలయ రజిత జూబిలీ మహోత్సవము

పునీత అద్భుత అంతోనివారి దేవాలయ రజిత జూబిలీ మహోత్సవము

విశాఖ అతిమేత్రాసనము బ్రౌన్ పేట, సామర్లకోట విచారణ లోని అంతోనివారి దేవాలయ రజిత జూబిలీ మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. దేవాలయ విచారణ కర్తలు గురుశ్రీ పీటర్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.

దేవాలయ నవదిన ప్రార్ధనలు  జూన్ 4 వ తేదీన  మంగళవారంనాడు ప్రారంభమయ్యాయి.  ఈ కార్యాక్రమం లో గురుశ్రీ ఎస్. శౌరిబాబు, పెద్దబొడ్డేపల్లి విచారణకర్తలు  పాల్గొని పండుగ పతాక ఆవిష్కరణ గావించారు. నవదిన ప్రార్ధనలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గం॥లకు జపమాల గం॥ 6.30 ని|| లకు దివ్యబలి పూజ ఆదివారం ఉదయం గం॥ 7-30 ని॥ లకు జపమాల 8-00 గం॥ లకు దివ్యబలి పూజ నిర్వహించనున్నారు.

పండుగా జూన్ 13  వ తేదీన జరగనున్నది. పండుగ రోజు సాయంత్రం 4 గం॥ లకు పునీత అంతోనివారి తేరుతో పుర ప్రదక్షణ కార్యక్రమము నిర్వహించనున్నారు. అనంతరం  సాయంత్రం గం|| 5-30 ని॥ లకు రజిత జూబిలీ మహోత్సవ దివ్యబలిపూజ జరగనున్నది.

విశాఖ అతిమేత్రాసన అపొస్తులిక పాలనాధికారి మహా పూజ్య పొలిమేర జయరావు గారు ప్రధాన అర్చకులగా  రజిత జూబిలీ మహోత్సవ దివ్యబలిపూజను  సమర్పించనున్నారు.   

 నవదిన ప్రార్ధనలో విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ  CH. రాజ కుమార్ , గురుశ్రీ మనోజ్ కుమార్, గురుశ్రీ డొమినిక్  సవియో, గురుశ్రీ మోహన్ ప్రసాద్ , గురుశ్రీ చిన్నప్ప , గురుశ్రీ వినయ్ , గురుశ్రీ కిరణ్ లు పాల్గొంటున్నారు.   

విశ్వాసులను ప్రేమతో ఆహ్వానించువారు విచారణకర్తలు గురుశ్రీ పీటర్ మరియు   ఎస్.ఎమ్.ఐ. సిస్టర్స్, ఉపదేశకులు, పెద్దలు, విశ్వాసులు.


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer